/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,081 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,11,977 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది.

కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 264 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 7,469 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినప్పటికీ.. ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఒక్క రోజులో గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 83,913 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.24 శాతంగా ఉంది. 2020 మార్చి తర్వాత అత్యల్ప యాక్టివ్​ కేసులు ఇవే కావడం గమనార్హం.

కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,77,422 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,740,275 మందికి కరోనా సోకగా.. అందులో 3,41,78,940 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 76,54,466 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,37,46,13,252 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 274,542,057 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,366,779 మంది మహమ్మారికి బలయ్యారు. 246,344,528 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 22,830,750 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: అమృత్‌సర్ గోల్డెన్‌ టెంపుల్‌లో అనూహ్య ఘటన.. ఆ వ్యక్తిని కొట్టిన చంపిన భక్తులు

Also read: Omicron Variant: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్, అప్పుడే 123 కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
India reports 7,081 new COVID19 cases, 264 deaths in the last 24 hours
News Source: 
Home Title: 

Corona cases in India: దేశంలో 2020 మార్చి స్థాయికి కరోనా యాక్టివ్​ కేసులు

Corona cases in India: దేశంలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత- 2020 మార్చి స్థాయికి యాక్టివ్​ కేసులు
Caption: 
India records 7,081 new COVID-19 cases, 264 deaths in last 24 hours (Representational Image Credits: PTI)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

దేశంలో 7,100 దిగువకు కరోనా కొత్త కేసులు

కొవిడ్ మరణాల్లోనూ స్వల్ప క్షీణత

137 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపణీ

Mobile Title: 
Corona cases in India: దేశంలో 2020 మార్చి స్థాయికి కరోనా యాక్టివ్​ కేసులు
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, December 19, 2021 - 10:18
Request Count: 
42
Is Breaking News: 
No