Peacock Viral Video: ఏ కుటుంబంలోనైనా తమకు ఎంతగానో కావాల్సిన వాళ్లు దూరమైతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. అయితే వాళ్లు మనకు మరింత దగ్గరివాళ్లు మరణిస్తే ఆ వేదన మామూలుగా ఉండదు. ఎంతసేపు ఏడ్చినా.. వాళ్లు తిరిగిరారు. కానీ, వాళ్లు లేకుండా ఇకపై జీవనం ఎలా సాగించాలనే ఆరోణ్య రోదన వర్ణానాతీతం.
అంతటి బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనుషుల్లో ఇలాంటి భావోద్వేగాలు సహజం.. కానీ జంతువులు లేదా మూగజీవుల్లో కూడా ఇలానే ఉంటుందంటే నమ్ముతారా? ఓ నెమలిలో అంత ఎమోషన్ కనిపించింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కుచేరాలో హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఓ నెమలి మృతిచెందగా.. దానిని ఖననం చేసేందుకు ఇద్దరు వ్యక్తులు సంచిలో పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఆ చనిపోయిన నెమతి మృతదేహం వెంబడి మరో మయూరం పరుగెత్తుకుంటూ వెళ్తోంది.
విగతజీవిగా పడి ఉన్న తన భాగస్వామిని అలా తీసుకెళ్తుంటే.. ఏం చేయాలో తెలియక.. మరణంలోనూ వదిలి వెళ్లలేక.. ఆ నెమలి దానినే అనుసరిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. హృదయాల్ని హత్తుకునే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కాస్వాన్.. సంబంధిత వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనకు వాట్సాప్‌లో ఈ క్లిప్ వచ్చిందని చెప్పారు.
The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb
— Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మనుషుల కంటే మూగజీవాలే ఎక్కువ ప్రేమ, ఆప్యాయత చూపించుకుంటాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఒంటరైన పక్షి పట్ల మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.
Also Read: Dangerous Snake Video: భయంకరమైన వీడియో- యువతిని పదేపదే కాటు వేసిన సర్పం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.