Black Movie: ఆది 'బ్లాక్' సినిమా రిలీజ్ డేట్‌కు ముహూర్తం ఖరారు.. హాట్ వేసవిలో కూల్ చిత్రం!!

Aadi Sai Kumar's Black Movie release date. జిబి కృష్ణ దర్శకత్వంలో అది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన 'బ్లాక్' సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 06:07 PM IST
  • ఆది 'బ్లాక్' సినిమా రిలీజ్ డేట్‌కు ముహూర్తం ఖరారు
  • హాట్ వేసవిలో కూల్ చిత్రం
  • ఏప్రిల్ 22న బ్లాక్ సినిమా విడుదల
Black Movie: ఆది 'బ్లాక్' సినిమా రిలీజ్ డేట్‌కు ముహూర్తం ఖరారు.. హాట్ వేసవిలో కూల్ చిత్రం!!

Aadi Sai Kumar's Black Movie to release on April 22: జిబి కృష్ణ దర్శకత్వంలో అది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బ్లాక్'. దర్శన బానిక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ నిర్మించారు. బ్లాక్ సినిమాలో ఆది క్యారెక్టర్ సరికొత్తగా ఉంటుంది. ఆది కెరీర్‌లోనే బ్లాక్ సినిమా ఓ స్పెషల్ చిత్రంగా నిలిచిపోనుంది. ఇటీవల విడుదల అయిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బ్లాక్ సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుంది. 

బ్లాక్ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు జిబి కృష్ణ ఈరోజు ప్రకటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. 'బ్లాక్ సినిమా కొత్తగా ఉంటుంది. ఆది గారి నటన, కథ, కథనం ఈ చిత్రానికి హై లైట్‌గా నిలుస్తాయి. మా నిర్మాత మహంకాళి దివాకర్ గారు రాజీ పడకుండా నిర్మించారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం. ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు. 

నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ... 'మా బ్లాక్ చిత్రం ఏప్రిల్ 22న విడుదల అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. వేసవిలో  కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. మంచి కథ, కథనంతో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాం. మా దర్శకుడు జిబి కృష్ణ బాగా కష్టపడి మంచి చిత్రాన్ని తీశారు. సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం మా ఆందరికీ ఉంది' అని ధీమా వ్యక్తం చేశారు.

బ్లాక్ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్ ఈ సినిమాలో ఆది సరసన హీరోయిన్‌గా నటించారు. బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రైమ్ నేపథ్యంలో బ్లాక్ సినిమా రూపొందింది. 

Also Read: Viral Video: నెత్తిపై బరువైన మూట, మలుపుల రోడ్.. హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కుతున్న యువకుడు!!

Also Read: Pancard Aadhaar Card Link: ఆధార్ కార్డు పాన్‌కార్డు అనుసంధాన గడువు మరోసారి పెంపు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News