Flipkart Mi Fan Festival: రూ.30 వేల విలువైన షియోమీ 11ఐ 5జీ ఫోన్​ రూ.10 వేలకే!

Flipkart Mi Fan Festival: స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ అదిరే ఆఫర్లు ఇస్తోంది. ముఖ్యంగా ఎం ఫోన్లపై.. ఫ్యాన్​ ఫెస్టివల్​ సేల్​లో భాగంగా రికార్డు స్థాయి డిస్కౌంట్లు ఇస్తోంది. ఇందులో రూ.30 వేల విలువైన ఫోన్​ను రూ.9 వేలకే కొనేందుకు అవకాశమిస్తోంది. ఈ ఆఫర్​ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 06:36 PM IST
  • ఫ్లిప్​కార్ట్​లో ఎంఐ ఫోన్లపై అదిరే ఆఫర్లు
  • ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్​లో భాగంగా భారీ డిస్కౌంట్లు
  • పరిమితకాలానికి నిర్ణయించిన తగ్గింపు ధరలు..
Flipkart Mi Fan Festival: రూ.30 వేల విలువైన షియోమీ 11ఐ 5జీ ఫోన్​ రూ.10 వేలకే!

Flipkart Mi Fan Festival: ఈ-కామర్స దిగ్గజం ఫ్లిప్​కార్ట్ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్​ సేల్ ప్రారంభిస్తోంది. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ సేల్​ ఎప్పటి వరకు కొనసాగనుంది. మరి ఈ స్పెషల్​ సేల్​లో ఆఫర్లు ఎలా ఉన్నాయి. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆఫర్లు ఇలా..

ఈ స్పెషల్​ సేల్​లో భాగంగా అన్ని రకాల ఎంఐ స్మార్ట్​ఫోన్లపై భారీ ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ముఖ్యంగా ఇటీవల ఆవిష్కరించిన 5జీ స్మార్ట్​ఫోన్​ 5జీ స్మార్ట్​.. షియోమీ 11ఐ 5జీపై ఈ సేల్​లో భారీ డిస్కౌంట్​ ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఈ ఆఫర్​ ఈ నెల 13 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్​ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనితో కేవలం నిమిషాల్లోనే ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

ఎంత తగ్గింపు పొందొచ్చంటే?

దాదాపు రూ.30 వేల విలువైన ఈ స్మార్ట్​ఫోన్​ను ఈ స్పెషల్​ సేల్​లో రూ.10 వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది. ఈ స్మార్ట్​ 6 జీబీ ర్యామ్​+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ.5 వేల డిస్కౌంట్ లభిస్తోంది.

ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్​ కింద మరింత తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్​, డెబిట్​ కార్డు ద్వారా ఈ ఫోన్​ను కొనుగోలు చేస్తే రూ.2 వేలు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ధరను రూ.22,999కి తగ్గుతుంది. ఇది మాత్రమే కాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కుడా పొందొచ్చు. మరి ఎక్స్ఛేంజ్ ద్వారా ఎంత తగ్గింపు పొందొచ్చంటే..

ఎక్స్ఛేంజ్ ఆఫర్​ వివరాలు ఇలా..

షియోమీ 11ఐ 5జీ ఫోన్​ కొనుగోలు చేసే వారికి.. పాత మొబైల్​ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.13 వేల వరకు తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఒక వేల డిస్కౌంట్ లభిస్తే.. ఈ ఫోన్​ ధర రూ.9,999కి చేరుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. రూ.13,000 ఎక్స్ఛేంజ్ అనేది అందరికి లభించకపోవచ్చు. ఫోన్​ మోడల్​, కండీషన్ వంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత ఎక్స్ఛేంజ్ విలువ నిర్ణయిస్తుంది ఫ్లిప్​కార్ట్​.

నోట్​: ఈ స్మార్ట్​ఫోన్ ఆఫర్లు కేవలం ఫ్లిప్​కార్ట్ వెబ్​సైట్​ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. ఈ మొబైల్ కొనే ముందు మరోసారి ఆఫర్ వివరాలను పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. 

Also read: Cheapest Recharge Plan: రూ.75 తో కాలింగ్, డేటా అది కూడా 30 రోజుల వరకు..!

Also read: Todays Gold Rate: ఇవాళ ఏప్రిల్ 10, 2022 దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News