Surya Grahan 2022: మతం, జోతిష్యం, ఖగోళ శాస్త్రాల కోణంలో సూర్య గ్రహణాన్ని ఓ పెద్ద సంఘటనగా పరిగణిస్తారు. హిందూ మత సంప్రదాయం ప్రకారం గ్రహణం రోజులు ఎలాంటి శుభ కార్యాలను నిర్వహించరు. అలాగే ఆ రోజున ఏమీ తినరు.. తాగరు. గ్రహణాల రోజు ఆలయాలను మూసేస్తారు. అదే సమయంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహణం రాశీచక్రంలోని మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. అయితే ఈ ఏడాది రానున్న తొలి గ్రహణం సూర్య గ్రహణం. అది ఏప్రిల్ 30న సంభవించనుంది. ఈ గ్రహణం మూలంగా 5 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
మేషరాశి (Aries)
మేష రాశి వారికి ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం చాలా ప్రయోజనాలను తెస్తుంది. గతంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయే కాలం ఆసన్నమైంది. పనిలో పురోగతి ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ గ్రహణం మూలంగా జీవితంలో ఏర్పడిన అన్నీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అవసరానికి డబ్బు అందుతుంది. పూర్వీకుల ఆస్తిని పొందుతారు.
వృశ్చికరాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 30 తర్వాత కాలం శుభప్రదంగా ఉండబోతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ సమయం వరంలా మారనుంది. ఈ రాశి వారు పురోగతి - ధనం, ప్రతిష్టతో పాటు అన్నింటిని పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం.
మకరరాశి (Capricorn)
మకర రాశి వారికి ఈ సూర్యగ్రహణం అనేక విధాలుగా లాభాలను ఇస్తుంది. ఉద్యోగార్థులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ పనులు ప్రశంసించబడతాయి.
(నోట్: ఈ సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Vastu Tips: లక్ష్మీ దేవీ కటాక్షం పొందాలంటే ఈ వాస్తు చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సిందే!
Also Read: Horseshoe Benefits: ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యాభివృద్ధి కోసం గుర్రపు నాడాతో ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook