Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని ప్రతి వాస్తు ప్రకారం ఉంచితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని వల్ల సుఖశాంతులు కలుగుతాయి. ఇంటి వాస్తు సరిగా లేకపోతే.. అనేక ప్రతికూలతలు ఏర్పడతాయి. కోటీశ్వరుడు కూడా దారిద్ర్యాన్ని ఎదుర్కొనే సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇంటి వాస్తు అనుసరించి కూడా.. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు అలాంటి వాస్తు నివారణల గురించి తెలుసుకుందాం.
వాస్తు చిట్కాలు
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ముఖద్వారం ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. ఇది సంపదలకు అధిపతి కుబేరుడు నివసించే దిక్కు . ఆ విధంగా ఇల్లు నిర్మించుకోవడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.
ఇంట్లోని డబ్బు పెట్టే సేఫ్ లేదా బీరువాను కూడా ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిక్కుగానే ఉంచాలి. అలా చేయడం వల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. లేదంటే పడమర, దక్షిణ దిక్కుగా సేఫ్ లేదా బీరువాను ఉంచడం వల్ల డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది. అప్పుల్లో మునిగే అవకాశం ఉంది.
ఈ తప్పులు ఎప్పడూ చేయకండి..
1) డబ్బును భద్రపరిచే బీరువా లేదా సేఫ్ దగ్గరగా చూపురు పెట్టకండి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుంది.
2) సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చవద్దు. ఆ సమయంలో లక్ష్మీ దేవి ఇంటికి వచ్చే సమయం. పగటిపూట ఎప్పుడైనా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు.
3) ఈశాన్యంలో చెత్తను ఎప్పుడూ ఉంచవద్దు. ఇది అత్యంత పవిత్రమైన దిక్కుగా భావిస్తారు. దీంతో పాటు ఆ దిక్కున మురికి ఎక్కువగా ఉన్నా.. ఇంట్లో పేదరికం వస్తుంది.
4) ఇంటి ప్రధాన ద్వారంపై దుమ్ము, ధూళి, మురికి లేకుండా ఎప్పటికప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైతే ప్రతిరోజూ సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది.
(నోట్: ఈ సమాచారమంతా వాస్తు శాస్త్రం నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Horseshoe Benefits: ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యాభివృద్ధి కోసం గుర్రపు నాడాతో ఇలా చేయండి!
Also Read: Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజున ఈ పూజ చేస్తే శని నుంచి విముక్తి తథ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook