జనసేన కార్యకర్తల కోసం యాప్ ప్రారంభం

జనసేన పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పార్టీలో 17 లక్షల మంది సభ్యులు చేరారని అంచనా. తాజాగా మరింతమంది సభ్యులను చేర్చుకోవడం కోసం యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు.

Last Updated : Apr 1, 2018, 10:04 PM IST
జనసేన కార్యకర్తల కోసం యాప్ ప్రారంభం

జనసేన పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పార్టీలో 17 లక్షల మంది సభ్యులు చేరారని అంచనా. తాజాగా మరింతమంది సభ్యులను చేర్చుకోవడం కోసం యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. అలాగే 93940 22222 నెంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా సభ్యత్వం నమోదు చేసుకోవచ్చని చెబుతున్నారు.

మహా సభావేదిక నుంచి పిలుపు ఇచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది మిస్డ్‌ కాల్‌ ద్వారా జనసేనలో సభ్యులయ్యారని ఈ సందర్భంగా జనసేన పార్టీ ఐటి విభాగం ప్రతినిధి విజయ నిర్మల తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే అనేకమంది యువతీ యువకులు పార్టీలో స్వచ్ఛందంగా పనిచేయడం కోసం వాలంటీర్లుగా కూడా చేరారని ఆమె తెలిపారు. అదేవిధంగా "జన సేవక" పేరుతో త్వరలోనే కార్యకర్తల కోసం డిజిటల్ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Trending News