karachi blast suiside bomber: చదివింది ఎంఫిల్. భర్త డెంటిస్ట్. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. అందమైన కుటుంబం. అయినా ఇవేవీ ఆమెను విద్వంసకరమైన లక్ష్యం వైపు పోకుండా ఆపలేకపోయాయి. ఈ నెల 26న కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి చేసిన మహిళ గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటకొచ్చాయి. ఆత్మాహుతి దాడి చేసిన మహిళ పేరు షారీ బలోచ్ అని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జువాలజీలో మాస్టర్స్ చేసిన ఆమె ఎంఫిల్ కూడా పూర్తిచేసింది. స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె కుటుంబం మొత్తం ఉన్నత విద్యావంతులే. తండ్రి లెక్చరర్ కాగా భర్త డెంటిస్ట్. ఎవరికీ గతంలో ఉగ్రవాద చరిత్ర లేదు. ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఎనమిదేళ్లు కాగా.. మరొకరికి ఐదేళ్లు.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో రెండేళ్ల కింద చేరింది షారీ బలోచ్. ఆత్మాహుతి దాడుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మజీద్ బ్రిగేడ్ లోని ఆత్మాహుతి దళంలో సభ్యత్వం తీసుకుంది. కఠిన శిక్షణ పొందింది. అయితే చిన్నపిల్లలున్న కారణంగా ఆత్మాహుతి దళం నుంచి బయటకెళ్లే అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. బలూచిస్తాన్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలను బీఎల్‌ఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై పలుసార్లు ఆ సంస్థ హెచ్చరికలు కూడా చేసింది. అయినా అక్కడ చైనీస్ బెల్డ్ రోడ్, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్థానికులు ఈ పనులకు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు ఆత్మాహుతి దాడికి పాల్పడింది బీఎల్‌ఏ.అందుకోసం షారీ బలోచ్ ను ఎంచుకుంది. ఇచ్చిన టార్గెట్‌ను ఏ మాత్రం గురితప్పకుండా ఫినిష్ చేసింది షారీ బలోచ్. ఈ ఆత్మాహుతి దాడిలో చైనాకు చెంది ముగ్గురు టీచింగ్ సిబ్బందితో పాటు పాక్ కు చెందిన వ్యాన్ డ్రైవర్ మృతిచెందారు.
షారీ ఆత్మాహుతి దాడిపై బీఎల్‌ఏ ప్రకటన రిలీజ్ చేసింది. బలూచిస్తాన్ లో చైనా కార్యకలాపాను సహించేది లేదని స్పష్టంచేసింది. బలూచిస్తాన్ వనరులను కొల్లగొడుతున్న పాక్ ఆర్మీకి సహకించడం మానుకోకుంటే మరిన్ని తీవ్ర దాడులు తప్పవని హెచ్చరించింది. అటు షారీ మృతిపై ఆమె భర్త ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తమ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతావని ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ ఘటనపై చైనా కూడా తీవ్రంగా స్పందించింది. చైనీయులు చిందించిన రక్తాన్ని వృధాకానీయమని స్పష్టంచేసింది. బాధ్యులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చింది.
Also read: Hepatitis Disease: వింత వ్యాధితో బాధపడుతున్న పిల్లలు...హెచ్చరించిన WHO.!!
Also read: Aung san suu kyi: ఆంగ్ సాన్ సూకీకి జైలు శిక్ష..ఎందుకు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook