Munnooru Ravi in TRS Plenary: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలోో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ అటెంప్ట్ కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి దర్శనం ఇచ్చాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీతో పాటు మున్నూరు రవి కూడా మరోసారి వార్తల్లో నిలిచాడు.
Munnooru Ravi at TRS Plenary meeting 2022 : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో మున్నూరు రవి ఎంట్రీ ఇవ్వడం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనేే కాదు.. మొత్తం రాజకీయవర్గాల్లోనూ చర్చనియాంశమైంది. ఇంతకీ ఈ మున్నూరు రవి ఎవరు, ఆయన టీఆర్ఎస్ ప్లీనరీకి వచ్చినంత మాత్రాన్నే అంత హాట్ టాపిక్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూస్తే మొత్తం సీన్ మీకే అర్థమైపోతుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ని హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఇటీవల కొన్ని వార్తలు పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తే ఈ మున్నూరు రవి. మంత్రి శ్రీనివాస్ గౌడ్కి, మున్నూరు రవికి మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలొచ్చాయి. అందులోనూ టీఆర్ఎస్ ప్లీనరీకి పార్టీకి చెందిన ఎంతో ముఖ్యులైన 3 వేల మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. మరి మున్నూరు రవికి కూడా పార్టీ నుంచి ప్లీనరీకి ఆహ్వానం అందిందా ? లేక మున్నూరు రవే చొరవ తీసుకుని మరెవరి పాస్పైనైనా టీఆర్ఎస్ ప్లీనరీకి వెళ్లాడా ? టీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది ?