Baglamukhi Jayanthi 2022 : భగళాముఖి జయంతి..అమ్మవారిని ఎలా పూజించాలి

Baglamukhi Jayanthi 2020 : మే 9న 2022 బగళాముఖి జయంతి. అసలు బగళాముఖి అంటే ఎవరు ? ఆమెను ఆరాధించడం వల్ల దక్కే ఫలితాలేంటి ? బగళాముఖి పూజా విధానాలు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Attili | Edited by - Attili | Last Updated : May 29, 2022, 06:45 PM IST
  • శత్రువుల నుంచి కాపాడే బగళాముఖి
  • బగళాముఖి అనుగ్రహం ఉంటే అన్నింటా విజయం
  • బగళాముఖి మరో పేరు పీతాంబరీ దేవి
Baglamukhi Jayanthi 2022 : భగళాముఖి జయంతి..అమ్మవారిని ఎలా పూజించాలి

Baglamukhi Jayanthi 2020 : మే 9న 2022 బగళాముఖి జయంతి. అసలు బగళాముఖి అంటే ఎవరు ? ఆమెను ఆరాధించడం వల్ల దక్కే ఫలితాలేంటి ? బగళాముఖి పూజా విధానాలు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం.

కాళికా దేవి దశ అవతారాల్లో బగళాముఖి ఒకరు.  ఈ అమ్మవారినే ఉత్తరభారత దేశంలో పీతాంబరీ  దేవిగా పిలుస్తారు. బంగారు సింహంపై పసుపు  వస్త్రాలు ధరించి దర్శనమిచ్చే ఈ అమ్మవారిని  ప్రార్థించడం వల్ల శత్రు నాశనం జరుగుతుందని  నమ్మకం. బగళ, ముఖి అనే రెండు పదాల  కలయికతో బగళాముఖి పదం ఏర్పడింది. బగళ  అనేది సంస్కృత ప‌దం వగళ నుంచి ఏర్పడింది.  వగళ అనగా బంధించేది అని అర్థం.

బగళాముఖిని పూజించడం వల్ల ప్రయోజనాలు

అన్ని రకాల భయాలు, శత్రు నాశనం కోరే వారు  బగళాదేవిని ఆరాధించాలి. అమ్మవారి దయ  ఉంటే అన్ని సమస్యలు వాటంతట అవే  తొలగిపోతాయి. ముఖ్యంగా కోర్టు కేసుల్లో జయం  కోరుకునే వారు బగళాదేవిని ఆరాధించడం  మంచిదని చెబుతారు.

పురాణాల్లో ఏం ఉంది

ఒకానొకప్పుడు ప్రపంచాన్ని మింగేసేటంతటి  ఉప్పెన వచ్చిందట. దాంతో దేవతలంతా సౌరాష్ట  ప్రాంతానికి చేరుకుని జగన్మాత కోసం ప్రార్థిస్తారు.  అంతట బగళాముఖీ దేవి ఉద్భవించిందట.  హరిద్ర సరోవరం నుంచి వచ్చి బగళాముఖి  ..ఉప్పెనను శాంతింపజేసింది.

బగళాముఖి జయంతి ..పూజా విధానం

సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి..  శుభ్రమైన పసుపు వస్త్రాలు ధరించాలి.  ఉత్తరదిశగా పసుపు వస్త్రంపై బగళాదేవి  అమ్మవారి ప్రతిమనూ, కలశాన్ని ఉంచి షోడశోప  ఉపచారాలతో పూజించాలి. పసుపు పువ్వులతో  పూజ చేయడం అమ్మవారికి అత్యంత ప్రీతికరం.  తర్వాత పాయసం, పండ్లు నివేదించాలి.

బగళాముఖి దేవాలయం

మా పీతాంబరి (బగళాముకి) ఆలయం  అమలేశ్వర్, రాయ్ పూర్, ఛత్తీస్ గఢ్.

బగళాముఖిదేవి మంత్రం

ఓం హ్రీం బగళాముఖీ దేవై: హ్లీం ఓం నమ:

Also Read:  Tsrtc Cuts Driver Salary : మైలేజీ తగ్గిందని డ్రైవర్ జీతంలో కోత.. ఆర్టీసీ వింత పోకడ

Also Read: Turmeric Farmers Protest at Mp Arvind: ఎంపీ అరవింద్‌కు పసుపు రైతుల నిరసన సెగ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News