Turmeric Farmers Protest at Mp Arvind: ఎంపీ అరవింద్‌కు పసుపు రైతుల నిరసన సెగ

Turmeric Farmers Protest at Mp Arvind: తెలంగాణలో పసుపు బోర్డు వ్యవహారం మళ్లీ ముదురుతోంది. ఈ అంశంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 03:09 PM IST
  • ఎంపీ అర్వింద్ నివాసం ముందు ఆందోళన
  • మరో మొదటికి పసుపు బోర్డు వ్యవహారం
  • దూకుడు పెంచిన టీఆర్ఎస్
Turmeric Farmers Protest at Mp Arvind: ఎంపీ అరవింద్‌కు పసుపు రైతుల నిరసన సెగ

Turmeric Farmers Protest at Mp Arvind : తెలంగాణలో పసుపు బోర్డు వ్యవహారం మళ్లీ ముదురుతోంది. ఈ అంశాన్ని తెరపైకి తెస్తూ.. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్‌ను అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు కార్నర్ చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే.. పసుపు బోర్డు సాధించుకొస్తానంటూ ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ జిల్లా రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు పదే పదే గుర్తు చేస్తూ.. ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఆయన నివాసం ముందు పసుపు కుప్పలు పోసి రైతులు ఆందోళనకు దిగారు. తమను ఎంపీ మోసం చేశారంటూ మండిపడ్డారు. అరవింద్ ఓట్ల కోసం తమ మనోభావాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో అరవింద్ ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

ఇటీవల బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం కుకునూరు గ్రామంలో పర్యటించాలని భావించిన ఎంపీ అరవింద్‌కు నిరసన సెగ తగిలింది. వేల్పూర్ క్రాస్‌ రోడ్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. అరవింద్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ ఆయన్ను రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ కార్యక్రమానికి హాజరు కాకుండానే అరవింద్ వెనుదిరిగారు. ఈ ఘటన మరువక ముందే ఆయన ఇంటిని పసుపు రైతు ముట్టడించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో ఇటీవల పర్యటించారు. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఎంపీగా అరవింద్ ఏ వాగ్దానం చేసి గెలిచారో... రెండున్నరేళ్లు అయినా ఆ హామీను నిలబెట్టుకోలేదంటూ ఆధారాలతో సహా చూపించారు. ఇందుకు సంబంధించి ఆర్టీఐ సమాచారాన్ని బయటపెట్టారు. దీంతో ఈ వ్యవహారం రచ్చరచ్చ అవుతోంది.

వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా పసుపు బోర్డు అంశంలో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు ఎలా కౌంటర్ చెబుతారో చూడాలి.

Also Read:  Tsrtc Cuts Driver Salary : మైలేజీ తగ్గిందని డ్రైవర్ జీతంలో కోత.. ఆర్టీసీ వింత పోకడ

Also Read: Cyclone Asani Update Today : తీవ్ర తుఫానుగా మారనున్న అసాని !.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News