ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన వర్మ ..మెగా ఫ్యామిలీపై మళ్లీ వార్

Last Updated : Apr 22, 2018, 06:18 AM IST
ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన వర్మ ..మెగా ఫ్యామిలీపై మళ్లీ వార్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఒట్టును తీసి గట్టు మీద పెట్టేశారు. ఇక  నుంచి మెగా ఫ్యామిలీ గురించి నెగిటివ్ కామెంట్స్ చేయనని ఇటీవలే వర్మ తన తల్లి మీద, తన వృత్తి మీద ఒట్టేసి చెప్పారు. దీంతో వర్మ-మెగా ఫ్యామిలీ వార్ ముగిసినట్లుగా అందరూ భావించారు. అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ తన ఒట్టును తీసి గట్టు మీద పెట్టేశారు. దానికి కారణాన్ని వివరిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు వర్మ .

 

 

Trending News