Live Murder Video: నడిరోడ్డుపై అరాచకం.. కత్తులతో పొడిచి యువకుడి హత్య... వీడియో వైరల్

Live Murder Video: ఢిల్లీలో కొంతమంది యువకుల మధ్య గొడవ హత్యకు దారితీసింది. నడిరోడ్డుపై ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 8, 2022, 12:35 PM IST
  • నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
  • కత్తులతో పొడిచిన యువకులు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Live Murder Video: నడిరోడ్డుపై అరాచకం.. కత్తులతో పొడిచి యువకుడి హత్య... వీడియో వైరల్

Live Murder Video: దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న ఓ బాలికపై 22 ఏళ్ల యువకుడు నడిరోడ్డుపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఇవాళ నడిరోడ్డుపై హత్య ఘటనకు సంబంధించిన ఓ వీడియో వెలుగుచూసింది. యువకుల మధ్య గొడవ ఒకరినొకరు కత్తులతో పొడుచుకునేదాకా వెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఢిల్లీలోని కల్యాణ్‌పురి బ్లాక్ 9లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో పడివున్న యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో యువకుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని అర్జున్‌గా పోలీసులు గుర్తించారు.

ఈ హత్య కేసులో హర్ష అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో మైనర్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. మిగతా నిందితులను కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్యకు గల కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: YSRCP Plenary Live Updates : ఘనంగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు.. ఇడుపులపాయలో జగన్ నివాళులు

Also Read: Heavy Rains: గోడ కూలి తల్లి, కూతురు మృతి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News