YSRCP Plenary 2022: ఏపీలో నేటి నుంచి రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న స్థలంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ కావడంతో అందరి దృష్టి అటువైపే ఉంది. ప్లీనరీ సమావేశాల తొలిరోజు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం, పార్టీ జెండా ఆవిష్కరణ, అధ్యక్ష ఎన్నికల ప్రకటన ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీ సమావేశాలపై ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ మీకోసం...