Ekmukhi Rudraksha: హిందూమతంలో రుద్రాక్షకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. దీనికి కారణం రుద్రాక్షలు శివుడి కన్నీటి నుంచి ఉద్భవించాయని పౌరాణికాల్లో ఉండటమే. శివుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్ష ధారణతో చాలా లాభాలున్నాయి. శివపురాణంలో 16 రకాల రుద్రాక్షల గురించి ప్రస్తావన ఉంది. అందరూ అన్ని రకాల రుద్రాక్షలు ధరించకూడదు. జ్యోతిష్యుని సలహా మేరకే రుద్రాక్ష ధరించాలి. ఏకముఖి రుద్రాక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శివ పురాణం ప్రకారం ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల భగవంతుడితో మమేకమైన అనుభూతి కలుగుతుంది. వ్యక్తి జీవన, మరణ చక్రం నుంచి విముక్తుడౌతాడు. మోక్షప్రాప్తికై మంచి సాధనంగా చెబుతారు.
ఏకముఖి రుద్రాక్ష అసలైందో కాదో గుర్తించేందుకు ఏకముఖి రుద్రాక్షను ఆముదం నూనెలో వేయాలి. మునుపటి రంగు కంటే ఎక్కువగా కన్పిస్తే అసలైందిగా చెప్పవచ్చు. ఏకముఖి రుద్రాక్షలో ఒకటే ధార ఉంటుంది. వేడి నీటిలో ఉడికించినప్పుుడు రంగు పోతే..నకిలీదని అర్ధం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏకముఖి రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు. ఏకముఖ రుద్రాక్ష సంబంధం సూర్యునితో ఉంది. అందుకే సింహరాశి జాతకులకు చాలా మంచిది. జ్యోతిష్యుని సలహా మేరకు ధరించాలి.
రోగాల్నించి విముక్తి లభిస్తుంది. రుద్రాక్ష ధారణ వల్ల వ్యక్తి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కుండలిలో సూర్యుడి బలహీనంగా ఉంటే..రుద్రాక్ష ధరించాలి. బ్లడ్ ప్రెషర్, గుండె సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రుద్రాక్షను ధరించడం వల్ల సంబంధిత వ్యక్తి ఇంద్రియాలను వశం చేసుకోవడంలో సఫలమౌతాడు. ధనలాభం కోసం కూడా రుద్రాక్ష ధరించాలి. అటు విద్యార్ధులకు కూడా ప్రయోజనకరం. కెరీర్‌లో విజయం కోసం ఏకముఖి రుద్రాక్ష ధారణ చాలా అవసరం.