New Beard Style: ఏం చేసిన గడ్డం ఒత్తుగా రావడం లేదా.. అయితే ఇలా చేయండి..!

New Beard Style 2022: ప్రస్తుతం చాలా మంది యువకుల గడ్డం అందంగా పెరగడానికి వివిధ రకాల చిట్కాలను పాటిస్తున్నారు. అంతేకాకుండా గడ్డాన్ని చాలా పొడవుగా కూడా పెంచుకుంటున్నారు. గడ్డంతో పాటు మీసాలు కూడా అందంగా పెంచుకుంటుండడం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 12:55 PM IST
  • ఏం చేసిన గడ్డం ఒత్తుగా రావడం లేదా..
  • గడ్డం, మీసాలను కత్తిరించండి
  • దువ్వెనతో దూయాలి
New Beard Style: ఏం చేసిన గడ్డం ఒత్తుగా రావడం లేదా.. అయితే ఇలా చేయండి..!

New Beard Style 2022: ప్రస్తుతం చాలా మంది యువకుల గడ్డం అందంగా పెరగడానికి వివిధ రకాల చిట్కాలను పాటిస్తున్నారు. అంతేకాకుండా గడ్డాన్ని చాలా పొడవుగా కూడా పెంచుకుంటున్నారు. గడ్డంతో పాటు మీసాలు కూడా అందంగా పెంచుకుంటుండడం విశేషం. నేటి తరం యువకులు ఎప్పటికప్పుడు తమ రూపాన్ని మార్చుకుంటారు. వివిధ రకాల స్టైల్‌లలో పలు రకాల గడ్డాలను పెంచుకుని ఆకర్శనీయంగా కనిపిస్తున్నారు. కొందరైతే..  బాలీవుడ్‌ హీరో రణవీర్ సింగ్ గ్ మీసాలు, గడ్డల స్టైల్‌ను స్ఫూర్తిగా తీసుకొని అతనిని అనుసరిస్తున్నారు. ఇతనిలా మీసాలు కలిపి ఉంచుకోవడానికి నేటితరం యువత ఇష్టపడతున్నారు.

ఇది ముఖానికి మంచి లుక్ ఇవ్వగలదు. కానీ ఇలా పెంచుకోవడం చాలా కష్టం. అంతేకాకుండా గడ్డం, మీసాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా అధికమని నిపుణులు చెబుతున్నారు. అయితే పలు రకాల చిట్కాలను ఉపయోగిస్తే గడ్డం అందంగా పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
తడి మీసాలపై ఈ తప్పు చేయకండి

మీసాలు కత్తిరించేటప్పుడు, పొరపాటున వాటిని తడి చేయవద్దు. తడిగా వాటిని కత్తిరించడం సులభం కావచ్చు, కానీ జుట్టు పొడిగా మారినప్పుడు, దాని నిజమైన పరిమాణం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ పొరపాటు మీ గడ్డం రూపాన్ని నాశనం చేస్తుంది. మీరు మీసాలు కత్తిరించినప్పుడల్లా అది పొడిగా ఉండేలా ప్రయత్నించండి.

గడ్డం, మీసాలను కత్తిరించడం అవసరం:

గడ్డం, మీసాల గ్రోత్‌ కోసం అబ్బాయిలు వాటిని కత్తిరించడం చాలా మేలు. అయితే ఇవి ఒత్తుగా లేని సందర్భంగా తప్పకుండా వీటిని పూర్తిగా తీసివేయాలి. ఇలా చేస్తే తొందలోనే వీరు దృఢమైన, ఒత్తైనా  గడ్డం, మీసాలను పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. గడ్డం, మీసాలు పెంచగానే సరిపోదు. వాటికి మంచి ఆకృతిని ఇవ్వాలి. కావున నాలుగు వారాల కోసారి  మీసాలు, గడ్డం కత్తిరించాలి.

దువ్వెనతో దూయాలి:

నేటి యువత చాలా మంది జుట్టును, గడ్డాన్రి దువ్వుకోవడం మానేశారు. కావున గడ్డం పెంచుకునే వారు తప్పకుండా జుట్టును దువ్వుకునే సందర్భంలోనే.. గడ్డాన్ని కూడా దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల గడ్డం కూడా దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా గ్రోత్‌ కూడా పెరుగుతుంది.  

నూనెతో మర్దన చేయండి:

తలకు నూనె పెట్టే క్రమంలో గడ్డానికి కూడా కొబ్బరి నూనెను పూయాలి. అయితే జుట్టుకు ఎలాంటి పోషకాలు కావాలో గడ్డానికి కూడా అవసరం. కావున తప్పకుండా జుట్టుకు నూనె పెట్టే క్రమంలో దీనికి కూడా పెట్టి మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల గడ్డం మంచి షేప్‌లోకి వస్తుంది.

Also read: World Emoji Day: నేడే ప్రపంచ ఎమోజీ దినోత్సవం.. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో తెలుసా..!

Also read:  Beard Growing Tips: మీకూ ఒత్తైనా గడ్డం రావాలంటే ఇలా చేయండి.. నెలలోనే స్ట్రాంగ్‌ బియర్డ్‌ వస్తుంది..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News