Black Rice For Diabetes: డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారిని వైద్యులు అన్నం తినకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే దీనిలో చక్కెర పరిమాణం అధికంగా ఉండడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున వీరు వైట్‌రైస్ తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా అధిక పోషకాలున్న పిండి పదార్థాలను తీసుకొవం చాలా మేలు. ఈ వ్యాధిగ్రస్తుల్లో చాలా మందికి అన్నం తినాలని కోరికలుంటాయి. అయితే వీరు బ్లాక్‌రైస్‌ను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణాలు తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
డయాబెటిస్ ఉన్న వారు బ్లాక్ రైస్‌ను తినొచ్చు:
డయాబెటిస్తో బాధపడుతున్న వారికి బ్లాక్ రైస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడాకి సహాయపడే లక్షణాలను ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.
బ్లాక్ రైస్ ప్రయోజనాలు:
బ్లాక్ రైస్‌లో ఐరన్, ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్ ప్లాంట్ పిగ్మెంట్స్ వంటి మూలకాలు ఉండడం వల్ల ఇవి నలుపు రంగులో కనిపిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సెల్స్ డ్యామేజ్‌ను నియంత్రిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్లు నెమ్మదిగా విడుదల చేసి బరువు పెరగకుండా కూడా ఇది ప్రభావవంతంగా కృషి చేస్తుంది.
గుండె జబ్బులకు ప్రభావవంతంగా కృషి చేస్తుంది:
మధుమేహంతో బాధపడేవారికి వచ్చే ప్రమాదం అధికం. అయితే మధుమేహం, గుండె జబ్బులతో బాధపడేవారికి నల్ల బియ్యం ఔషధం కంటే ఎక్కువగా పని చేస్తుంది. అంతేకాకుండా ధమనులలో రక్త సరఫరాను సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ రైస్‌లో ప్రొటీన్ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook