Diabetes Patients: డయాబెటిస్ ఉన్నవారు ఉదయం పూట ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ చేస్తే 10 రోజుల్లో షుగర్ వ్యాధికి చెక్..!

Breakfast in Diabetes: ప్రస్తుతం భారత్ లో ప్రతి ఇద్దరిలో ఒకరు మధుమేహం బారిన పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 05:36 PM IST
  • డయాబెటిస్ ఉన్నవారు ఆహారం నియమాలు పాటించాలి
  • ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్‌ తీసుకోవాలి
  • శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి
Diabetes Patients: డయాబెటిస్ ఉన్నవారు ఉదయం పూట ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ చేస్తే 10 రోజుల్లో షుగర్ వ్యాధికి చెక్..!

Breakfast in Diabetes: ప్రస్తుతం భారత్ లో ప్రతి ఇద్దరిలో ఒకరు మధుమేహం బారిన పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టిఫిన్ చేసే క్రమంలో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా చక్కర పదార్థాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలు ఆరోగ్య నివేదికలు తెలిపాయి.

ఈ డయాబెటిస్ నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో, వైద్యశాస్త్రంలో పాలు చిట్కాలను సూచించారు. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారం తీసుకునే సందర్భంలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో పోషకాలు ఉండే ఓట్స్ ను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు డయాబెటిస్ పై ప్రభావంతంగా పోరాడుతాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా శరీరానికి అధికంగా మేలు చేసే చియా ఓట్స్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్యులు తెలుపుతున్నారు. ఈ చియా ఓట్స్ రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించేందుకు తోడ్పడతాయి. అయితే వీటి ద్వారా శరీరానికి లభించే ఇతర ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఓట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

>>చియా విత్తనాలు
>>2 స్పూన్ పెరుగు
 >>అర కప్పు బెర్రీలు
 >>1/4 కప్పు బాదం పాలు
 >>మూడింట రెండు వంతుల కప్పు వాల్నట్
 >>టాపింగ్ కోసం దాల్చిన చెక్క

తయారీ విధానం:

 ముందుగా ఓట్స్, చియా గింజలు, పెరుగు, బెర్రీలు, బాదం పాలు, దాల్చిన చెక్కలను ఒక బౌల్ లో వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేసిన వాటిని ఒక బౌల్లో నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని ఉదయం పూట క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

వీటిని తినడం వల్ల వచ్చే పోషకాలు:
ఈ చియా ఓట్స్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల వీటి నుంచి.. 327 కేలరీలు, 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 15 గ్రాముల ప్రోటీన్, 16 గ్రాముల కొవ్వు, 13 గ్రాముల వరకు ఫైబర్ లభిస్తుంది. ఈ ఓట్స్‌లోని ప్రోటీన్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా.. ఇది రక్తంలో గ్లూకోజ్ ప్రవాహాన్ని కూడా తగ్గిచి.. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

Also Read: Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..

Also Read: Gold Price Today: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలివే..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News