Governor Tamili Sai: ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వెళ్లక పోవచ్చు అని అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతోనే ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాను ప్రోటోకాల్ ఆశించడం లేదన్నారు గవర్నర్ తమిళిసై. రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్ వచ్చి వెళ్లాక కూడా ప్రోటోకాల్ వ్యవహారంలో మార్పు రాలేదని విమర్శించారు. తాను భద్రాచలం వెళ్లినా అధికారులు ఎవరూ రాలేదన్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో తాను పోల్చుకోనని తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండటం తన నైజమని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అడుగుతున్నారని తెలిపారు.
గవర్నర్ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఇటీవల ప్రోటోకాల్ అంశంపై తీవ్ర దుమారం రేగింది. దీనిపై రాష్ట్రంలో సైలెంట్‌గా ఉన్న ఆమె..ఢిల్లీకి వెళ్లాక తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గానీ..సీఎం కేసీఆర్ గానీ తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడాన్ని తప్పుపట్టారు. తన తల్లి చనిపోయినా సీఎం కేసీఆర్ రాలేదని వాపోయారు.
తాజాగా మళ్లీ ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి బాంబ్ పేల్చారు. ఈసారి వ్యక్తిగత వ్యాఖ్యలు కాకుండా రాజకీయంగా విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ఆరోపణలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమిళిసై గవర్నర్‌లా కాకుండా బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలుకుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Governor Tamili Sai: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చు..గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు..!
తెలంగాణలో రాజకీయ వేడి
గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం
తాజాగా తమిళిసై కీలక వ్యాఖ్యలు