TTD Kalayanamashu: టీటీడీ కీలక ప్రకటన.. ఇవాళ జరగాల్సిన కల్యాణమస్తు వాయిదా.. కారణమిదే...

TTD Kalyanamasthu Postponed: ఇవాళ జరగాల్సిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ వాయిదా వేసింది. ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేయక తప్పలేదు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 7, 2022, 07:53 AM IST
  • టీటీడీ బోర్డు కీలక నిర్ణయం
  • కల్యాణమస్తు కార్యక్రమం వాయిదా
  • ప్రభుత్వ అనుమతులు రానందు వల్లే వాయిదా
TTD Kalayanamashu: టీటీడీ కీలక ప్రకటన..  ఇవాళ జరగాల్సిన కల్యాణమస్తు వాయిదా.. కారణమిదే...

TTD Kalyanamasthu Postponed: టీటీడీ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాని కారణంగా కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసేందుకు నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కల్యాణమస్తు నిర్వహణకు సంబంధించి కొత్త తేదీ ప్రకటించే అవకాశం ఉంది. 

ముందుగా ప్రకటించిన ప్రకారం.. ఆదివారం (ఆగస్టు 7) ఉదయం 8.07 గం. నుంచి 8.17 గం. మధ్యలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ మండపాల్లో కల్యాణమస్తు కార్యక్రమం జరగాల్సి ఉంది. కల్యాణమస్తులో వివాహం చేసుకోవాలనుకునే జంటలకు జూలై 1 నుంచే దరఖాస్తు ఫారమ్‌లను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పెళ్లి ఖర్చులు భరించలేని పేదింటి హిందూ బిడ్డల పెళ్లిళ్ల కోసం టీటీడీ కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది.

ఇవాళ తలపెట్టిన కల్యాణమస్తు కార్యక్రమం కోసం అనుమతులు కోరుతూ టీటీడీ ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఇప్పటివరకూ అనుమతులు రాలేదు. దీంతో చివరి నిమిషంలో కల్యాణమస్తు కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయక తప్పలేదు. 2011లో టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసింది. అప్పట్లో అవినీతి ఆరోపణలు, ఆర్థిక భారం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని పునరుద్ధరించారు. గతేడాది కల్యాణమస్తు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరిగాక కరోనా విజృంభించడంతో రద్దవక తప్పలేదు. ఇక ఈ ఏడాది ప్రభుత్వ అనుమతుల జాప్యంతో ఈ కార్యక్రమం వాయిదాపడింది.

కల్యాణమస్తులో నిర్వహించే సామూహిక వివాహాల్లో వధూవరులకు మంగళసూత్రాలు, పట్టు వస్త్రాలను టీటీడీ ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే, ఉచిత భోజన సదుపాయం కల్పిస్తుంది. దీంతో చాలామంది పేద జంటలు టీటీడీ నిర్వహించే కల్యాణమస్తు ద్వారా పెళ్లి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటారు.

Also Read: Basara IIIT Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళి సై.. పోలీసుల ఆంక్షలపై సీరియస్

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ధరలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News