Viral Video: మెరుపు వేగంతో దూసుకొచ్చి దాడికి యత్నించిన మొసలి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Horrific Viral Video: నీళ్లలో మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఓ మొసలి అదే సరస్సులో ఈత కొడుతున్న ఓ వ్యక్తిపై దాడికి యత్నించింది. మొసలికి ఏం అనిపించిందో కానీ దాడి చేసినట్లే చేసి ఆగిపోయింది. దీంతో ఆ వ్యక్తి సేఫ్‌గా ఒడ్డుకు చేరుకున్నాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 13, 2022, 02:39 PM IST
  • సరస్సులో ఈ కొడుతున్న వ్యక్తిపై దాడికి యత్నించిన మొసలి
  • కొద్దిలో దాడి నుంచి తప్పించుకున్న మొసలి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Viral Video: మెరుపు వేగంతో దూసుకొచ్చి దాడికి యత్నించిన మొసలి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Horrific Viral Video: బ్రెజిల్‌కి చెందిన ఓ వ్యక్తి సరదాగా ఓ సరస్సులో ఈతకు దిగాడు. ఈత కొడుతూ అలా కొద్ది దూరం వెళ్లాక నీళ్లలో నుంచి తల పైకెత్తిన మొసలి కనిపించింది. అంతే.. గుండె ఆగినంత పనైంది. మరో ఆలోచన లేకుండా వెంటనే ఒడ్డుకు చేరేందుకు వెనక్కి ఈదడం మొదలుపెట్టాడు. ఇంతలో మొసలి మెరుపు వేగంతో అతని వైపు దూసుకొచ్చింది. ఒకానొక దశలో అతనిపై దాడి చేసినంత పనిచేసింది. అదృష్టవశాత్తు అతను తప్పించుకోగలిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రెజిల్‌లోని ఓ ప్రాంతంలో ఉన్న సరస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ  సమయంలో సరస్సు ఒడ్డునే ఉన్న విలియన్ కేటానో అనే వ్యక్తి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. మొసలి సడెన్‌గా అతనిపై దాడి చేయడంతో తానూ షాక్ తిన్నట్లు చెప్పాడు. కేటానో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని 52 మిలియన్ల మంది వీక్షించారు. 

వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొసలి దాడి కన్నా నీళ్లలో దాని వేగం ఎక్కువగా భయపెట్టిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నిజానికి అది మొసలి పిల్ల అయి ఉంటుందని.. అందుకే అతను తప్పించుకోగలిగాడని.. లేకపోతే మొసలికి ఆహారమై ఉండేవాడని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Also Read: RBI Instructions: లోన్ రికవరీ ఏజెంట్స్‌కు ఆర్‌బీఐ వార్నింగ్.. ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందే...

Also Read: Munugodu Byelection Live Updates: మునుగోడు పాదయాత్రకు రేవంత్ దూరం.. కేసీఆర్ తో కంచర్ల సోదరుల సమావేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News