Bhadrapada Tips 2022: శ్రావణ మాసం లాగే భాద్రపద మాసం కూడా భక్తికి నెలవు. భాద్రపద మాసంలోనే శ్రీకృష్ణ జన్మాష్ఠమి, గణేశ్ చతుర్థి వస్తాయి. ఈసారి భాద్రపద మాసం ఉత్తరాదిలో ఆగస్టు 13న ప్రారంభమై సెప్టెంబర్ 10 వరకు ఉండనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఉండనుంది. శ్రావణ మాసం లాగే భాద్రపద మాసానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం భాద్రపద మాసంలో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
భాద్రపదంలో చేయకూడని పనులివే :
బెల్లం, పెరుగు, వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసాహారం.. ఈ పదార్థాలను భాద్రపద మాసంలో తీసుకోవద్దు. ఈ కాలంలో వీటి వాడకం ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రం చెబుతోంది.
భాద్రపద మాసంలో సాదాసీదా జీవితం గడపాలి. వీలైతే నేలపై చాప వేసుకుని నిద్రించడం మంచిది.
ఈ మాసంలో అబద్దాలు చెప్పడం, అసూయ, కోపం వంటివి వీడాలి.
తల వెంట్రుకలు, గడ్డం.. ఇలా క్షవర పనులేవీ పెట్టుకోవద్దు.
కొబ్బరినూనె వాడవద్దు. ఇది చిన్నారుల్లో సంతోషాన్ని తగ్గిస్తుంది.
పొగాకు, గుట్కా, సిగరెట్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి
శారీరక కలయికకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.
చేయాల్సిన పనులు ఇవే :
ఈ మాసంలో విష్ణువు, శ్రీకృష్ణుడు, గణేశుడు, పార్వతి, శివుడిని పూజించాలి. తద్వారా మీ కోరికలు నెరవేర్చబడుతాయి.
పవిత్ర నదీ స్నానం చేసి దైవ పూజ చేస్తే మంచిది. ప్రతీ రోజూ చల్లని నీటితోనే స్నానం చేయాలి.
పేదలకు తోచిన సాయం చేయాలి.
శ్రీకృష్ణుడికి తులసి దళం సమర్పించాలి. దాన్ని పాలల్లో వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
శారీరక ధృఢత్వానికి పంచగవ్వ వాడవచ్చు.
ఈ మాసంలో సూర్యుడిని ఆరాధిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే ఉద్యోగ-వ్యాపారాలలో విజయం చేకూరుతుంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉండవచ్చు. జీ తెలుగు న్యూస్ దానిని నిర్ధారించలేదు.)
Also Read: Rakesh Jhunjhunwala: రాకేశ్ ఝుంఝన్‌వాలా జన్మస్థలం హైదరాబాదే.. ఆయన మొత్తం ఆస్తి ఎంతో తెలుసా?
Also Read: NBK 107: అన్ని సినిమాలు ఉన్నా సంక్రాంతి బరిలో బాలయ్య.. టైటిల్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook