NBK 107: అన్ని సినిమాలు ఉన్నా సంక్రాంతి బరిలో బాలయ్య.. టైటిల్ అదేనా?

NBK 107 Getting Ready for 2023 Sankranthi Release: నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన సినిమాకు పలు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2022, 10:25 AM IST
NBK 107: అన్ని సినిమాలు ఉన్నా సంక్రాంతి బరిలో బాలయ్య.. టైటిల్ అదేనా?

NBK 107 Getting Ready for 2023 Sankranthi Release: అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలలో నటిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా పేరు ఫిక్స్ చేయనీ సినిమాకు అనేక టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. జై బాలయ్య, రెడ్డి గారు, అన్నగారు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ లో జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాతలు షూటింగ్స్ నిలిపివేయాలని కోరినా నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ నిలిపి వేయకూడదని కోరడంతో సినిమా షూటింగ్ అయితే ప్రస్తుతానికి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక కమిటీ ఏర్పాటు చేసి బాలకృష్ణను కలవడానికి పంపించారు. ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగే అవకాశం ఉందని తాజాగా ప్రచారం జరుగుతోంది.

నిజానికి ఇప్పటికే సంక్రాంతి బరిలో పలు పెద్ద సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలు సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్, విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా సిద్ధమవుతున్నాయి.

దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఒకేసారి రెండు సినిమాలు రావడం కష్టం కాబట్టి ఆ ప్రొడక్షన్ నుంచి ఒకే సినిమా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అయినా సరే మిగతా సినిమాలు చాలా రంగంలోకి దిగుతున్నా సరే నందమూరి బాలకృష్ణ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతూ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగానే బాలకృష్ణ ఎవరి కోసం వెనక్కి తగ్గరు. మరి ఇన్ని సినిమాలు ఉన్నా సరే తన సినిమాను విడుదల చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తారు. ఈ విషయంలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: Fact Check: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. అసలు నిజం ఇదీ!

Also Read:  Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News