Walking To Lose Weight: బరువు తగ్గడం చాలా మంది వివిధ రకాల నియమాలు పాటిస్తున్నారు. ముఖ్యంగా తీవ్రమైన వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బరువు తగ్గడం సులభమైనప్పటికీ ఆరోగ్యంగా బరువు తగ్గడం చాలా కష్టం. అయితే పలు రకాల ఆహార నియమాలు పాటించి.. వ్యాయామాలు చేయడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువ సేపు నడవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు. అయితే ఈ క్రమంలో పలు రకాల నియమాలు అనుసరించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి ఇలా చేయండి:
ఇలా నడవాలి:
బరువు తగ్గడానికి..రోజుకు 15,000 అడుగులు నడవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో అడుగులను లెక్కించుకోవడానికి స్మార్ట్ వాచ్ సహాయం తీసుకోవచ్చు. ఇలా నడిచే క్రమంలో టెన్షన్ గా ఉండకూడదు.
నిటారుగా నడవండి:
నిటారుగా నడవడానికి ఎత్తైన ప్రదేశాలను ఎంచుకోవాలి. ఎత్తుపైకి నడవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కరిగి బరువు సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా ఇది కొందరిలో కండరాలను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.
20 నిమిషాలు నడవండి:
రోజుకు కనీసం 3 సార్లు 20 నిమిషాలు కంటే ఎక్కువగా నడవాలి. ఇలా నడవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడడమేకాకుండా..రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా రోజూ 20 నిమిషాల పాటు నడవాలని నిపుణులు తెలుపుతున్నారు.
గ్రీన్ టీ:
వాకింగ్ చేయడాని ముందు గ్రీన్ టీ తాగడం చాలా మంచిదని నిపుణులు తెలుపున్నారు. ఇది బరువును ఆరోగ్యంగా తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook