Aak Leaves For Diabetes: డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల ఔషధాలు ఉన్నాయి. పూర్వీకులు ఈ చికిత్స కోసం ఆయుర్వేదపై ఆధారపడేవారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీటిని తప్పకుండా పాటించడం వల్ల డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు.
జిల్లెడు ఆకులో ఆయుర్వేదం గుణాలు:
జిల్లెడు ఆకులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఆంగ్లంలో దీనిని Giant Calotrope అని పిలుస్తారు. ఇందులో శరీరంలోని రక్తంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే గుణాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీటితో తయారు చేసిన ఔషధాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఆకుల వల్ల మధుమేహం రోగులకు కలిగే ప్రయోజనాలు:
ప్రస్తుతం చాలా మందిలో మధుమేహం సమస్యలు వస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవద్దు.
ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి:
దీని కోసం ఈ ఆకులను ఎండలో ఎండబెట్టి, ఆపై దానిని మెత్తగా పొడిలా చేయండి. ఇప్పుడు ఈ పొడిని ప్రతిరోజూ 10 ml నీటిలో కలపి తీసుకోండి. అంతేకాకుండా రాత్రిపూట దాని పొడిని అరికాళ్ళపై ఉంచి సాక్స్‌లు ధరించి నిద్రపోవడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
జిల్లెడు ఆకుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి..?:
ఈ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు దంత సమస్యలు, మలబద్ధకం, అతిసారం, కీళ్ల నొప్పులు సమస్యలను దూరం చేస్తాయి.
వీటిని సేరించే ముందు జాగ్రత్త అవసరం:
ఈ ఆకులను సేకరించే ముందు చెట్టు నుంచి తెల్లటి పాలు వస్తాయి. కాబట్టి ఇవి కంటికి చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ ఆకును ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ మిశ్రమాన్ని పిల్లలకు అస్సలు పెట్టకూడదు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook