Mangal Gochar 2022: అంతరిక్షంలో ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. అదే విధంగా అంగారకుడు ఈ నెలలో తన రాశిని మార్చనున్నాడు. మెుదట అక్టోబరు 16న మిథునరాశిలోకి ప్రవేశించనున్న కుజుడు.. 30న అదే రాశిలో తిరోగమనం (Mars Retrograde 2022) చెందుతాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. మిథునరాశిలో అంగారక సంచారం కొన్ని రాశులకు ఇబ్బందికరంగా మారవచ్చు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries)- మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల మేష రాశి వారికి ఇబ్బందులకు గురవుతారు. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు చర్చలకు దూరంగా ఉండండి. అయితే ఈ సమయంలో ఈ రాశివారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
వృషభం (Taurus)- ఈరాశి వారికి అంగారకుడి సంచారం అశుభంగా భావిస్తారు. వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆర్థిక వ్యయం పెరగవచ్చు. దీంతో వీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. అంతేకాకుండా కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది.
మిథునరాశి (Gemini)- మిథునరాశిలో కుజుడు సంచారం వల్ల ఈ రాశివారి ఆరోగ్యం క్షీణించవచ్చు. దీంతో ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలని ఈ సమయం సరైనది కాదు.
కర్కాటక రాశి (Cancer)- మిథునరాశిలో అంగారక సంచారం కర్కాటక రాశి వారికి శుభప్రదం కాదు. వీరి ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీంతో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
మీనరాశి (Pisces)- ఏదైనా ఆస్తి లేదా మరేదైనా కొనుగోలు చేయడానికి ఈ సమయం సరైనది కాదు. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీ తల్లి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
Also Read: Surya Gochar 2022: దసరా తర్వాత సూర్యుడు రాశి మార్పు.. ఈ 5 రాశులవారి కెరీర్ కు మాంచి ఊపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook