Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. దసరా తర్వాత సంచలనాలు జరగనున్నాయని గతంలో బీజేపీ నేతలు చెప్పారు. వాళ్లు చెప్పినట్లే తాజా పరిణామాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కాంలో కొన్ని రోజులుగా దాడులు తగ్గించిన ఈడీ.. బీజేపీ నేతలు చెప్పినట్లే దసరా తర్వాత స్పీడ్ పెంచింది. శుక్రవారం హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ఈడీ సోదాలన్ని ప్రస్తుతం ఆంధ్రప్రభ పత్రిక చుట్టూ తిరుగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న అర్జున్ పాండే ఆంధ్రప్రభ గ్రూపుకు చెందిన ఇండియా అహెడ్ ఇంగ్లీష్ ఛానెల్ కు గతంలో మార్కెటింగ్ చీఫ్ గా పని చేసినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయినపల్లి అభిషేక్ ఆంధ్రప్రభ ఇండియా అహెడ్ లో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. దీంతో ఆంధ్రప్రభ చైర్మెన్ ముత్తా గోపాలకృష్ణను ఈడీ ప్రశ్నించింది.హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ పత్రిక కార్యాలయంతో పాటు ఢిల్లీ, పంజాబ్ సహా మొత్తం 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. గతంలో అరెస్టు చేసిన సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. ముత్తా కుటుంబం నిర్వహిస్తున్న ఆంగ్ల చానెల్‌కు అర్జున్ పాండేకు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బోయిన్‌పల్లి అభిషేక్ ఇల్లు, కార్యాలయాల్లో గతంలోనే ఈడీ అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కాంలో ఏ14 నిందితుడిగా ఉన్న అరుణ రామచంద్రన్ పిళ్లేతోనూ అభిషేక్ కు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచాపరణలో తేలిందంటున్నారు. తాజాగా ఈడీ జరిపిన దాడుల్లో ఇండియా అహెడ్ సంస్థలోనూ అభిషేక్ డైరెక్టర్‌గా ఉన్నట్లు తేలింది. ఇండియా అహెడ్‌లో అభిషేక్ పెట్టుబడులకు సంబంధించి పక్కా ఆధారాలను ఈడీ సేకరించిందని సమాచారం. ఢిల్లీ డిఫ్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సన్నిహితుడు దినేశ్ అరోరాకు బ్యాంక్ ఖాతాలోకి యూకో బ్యాంకు ద్వారా సమీర్ మహేంద్రు కోటి రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడి విచారణలో తేలింది. ఆ నగదు తర్వాత సిసోడియాకు చేరిందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ ఆరోపించింది. కోట్ల రూపాయల వరకు నగదు బదిలీ చేసిన అర్జున్ పాండే, విజయ్ నాయర్, రామచంద్ర పిళ్లె మీద కూడా ఈడీ కేసులు నమోదు చేసింది.
లిక్కర్ స్కాంలో ఈడీ తాజా దాడులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. మీడియా హౌజ్ తో పాటు అధికార పార్టీ ముఖ్య నేతల సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతుండటంతో త్వరలోనే కీలక పరిణామాలు జరగనున్నాయనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నట్లు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల అరెస్ట్ తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Chiranjeevi Pothuraju Steps: పోతురాజు స్టెప్పులేసిన చిరంజీవి.. వీడియో వైరల్
Read Also: Khushbu sundar: ఆస్పత్రి బెడ్డుపై కుష్బూ.. నటి పరిస్థితి ఎలా ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook