మనకు తెలియకుండానే జన్‌ధన్ ఖాతాల మార్పు

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జన్‌ ధన్ ఖాతాలకు కొన్ని బ్యాంకులు ఎసరు పెడుతున్నాయి.

Last Updated : May 28, 2018, 11:05 PM IST
మనకు తెలియకుండానే జన్‌ధన్ ఖాతాల మార్పు

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జన్‌‌ధన్ ఖాతాలకు కొన్ని బ్యాంకులు ఎసరు పెడుతున్నాయి. ఆర్బీఐ 'బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్' పై హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంకు సహా ఇతర బ్యాంకులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. అనేక జన్‌‌ధన్ ఖాతాలను బ్యాంకులు ఖాతాదారులకు తెలియకుండానే రెగ్యులర్ ఖాతాలుగా మార్చేస్తున్నాయి.

ఈ ఖాతాల్లో నెలకు 4సార్లు ఉచిత విత్ డ్రాకు వీలుండగా.. 4సార్లు పూర్తవగానే ఆ ఖాతాలను కొన్ని బ్యాంకులు ఫ్రీజ్ చేస్తుంటే.. ఇంకొన్ని ఐదో లావాదేవీ జరిగే ఖాతాలను సాధారణ ఖాతాలుగా మారుస్తున్నాయి. దీంతో నగదు, ఖాతా నిర్వహణ చార్జీలు కస్టమర్లపై తెలియకుండానే పడుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంకు ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తుండగా.. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు వంటివి కూడా నాలుగుసార్లు విత్ డ్రా పూర్తి కాగానే ఖాతాదారుల నుంచి సంతకాలను సేకరించి..ఆ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నాయని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ నివేదికలో వెల్లడైంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ప్రారంభించారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సదుపాయం కల్పించాలనేది ఈ యోజన ఉద్దేశం. 7 ఏప్రిల్ 2018 వరకు అందిన సమాచారం ప్రకారం, 31 కోట్ల మందికి జన్‌ధన్ అకౌంట్లు ఉన్నాయని.. 80 వేల కోట్లకు పైగా నగదు జమైందని ఆర్థిక శాఖ నివేదికలు చెప్తున్నాయి.

పథకం వివరాలు

  • ఖాతాదారుకు రూ.5000వరకు ఓవర్ డ్రాఫ్ట్
  • రూ.1,00,000 యొక్క ప్రమాద భీమా
  • రూ.30,000 జీవిత భీమా
  • రుపే డెబిట్ కార్డు
  • గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు మిత్రా ద్వారా బ్యాంకు సేవలు

Trending News