Ram Charan Cooking : వెకేషన్లో వంటా వార్పు.. రామ్ చరణ్ వీడియో

Ram Charan Cooking And Driving రామ్ చరణ్‌కు వెకేషన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జపాన్ దేశంలో సందడి చేసిన రామ్ చరణ్‌.. ఆఫ్రికాకు వెళ్లి అక్కడ వంటలు, డ్రైవింగ్, ఫోటోలు తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 06:38 AM IST
  • వెకేషన్లో రామ్ చరణ్ సందడి
  • వంట వార్పులో బిజీగా హీరో
  • వెకేషన్ వీడియో నెట్టింట్లో వైరల్
Ram Charan Cooking : వెకేషన్లో వంటా వార్పు.. రామ్ చరణ్ వీడియో

Ram Charan Untamed Africa Vacation : రామ్ చరణ్, ఉపాసనలు ఎక్కువగా వెకేషన్స్ వెళ్తుంటారు. ఇక ఇద్దరూ జంతు ప్రేమికులే కాబట్టి.. ఎక్కువ వైల్డ్ లైఫ్ సాంక్ఛుయరిలకే వెళ్తుంటారు. గతంలో  ఓ సారి ఆఫ్రికాలో ఇలానే వెళ్లారు. అక్కడ పులులు, సింహాలను ఫోటో తీస్తూ రామ్ చరణ్ తన టాలెంట్‌ను చూపించాడు. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్‌ ఆఫ్రికా వెకేషన్లో పడ్డాడు. అయితే వెంట ఉపాసన ఉందా? లేదా? అన్నది తెలియడం లేదు.

రామ్  చరణ్‌ ఇన్ని రోజులు జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జపాన్‌లో త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా రాజమౌళి ఫ్యామిలీ, ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యామీలు సందడి చేశాయి. జపాన్‌లోనే వారానికి పైగా ఉండి.. ప్రమోషన్స్ చేశారు. అక్కడి ఫ్యాన్స్ ఆడిపాడారు. జపాన్ ట్రిప్ వల్ల రామ్ చరణ్ మెగా దివాళి ఈవెంట్లో పాల్గొనలేకపోయాడు. ఇదే విషయాన్ని చెబుతు.. అక్కడ దీపావళి మిస్ అయినా ఇక్కడ అభిమానుల ప్రేమ దొరికిందని అన్నాడు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

ఇప్పుడు రామ్ చరణ్ ఆఫ్రికాలో తిరుగుతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో రామ్ చరణ్‌ కుకింగ్ చేస్తున్నాడు. జీప్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సింహం పిల్లను ఫోటో తీస్తున్నాడు. మొత్తానికి వెకేషన్లో మాత్రం ఫుల్ సందడి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఈ వీడియోలు ఉపాసన ఎక్కడా కనిపించలేదు. కనీసం ఉపాసనను కూడా ట్యాగ్ చేయలేదు. ఉపాసన కూడా కామెంట్ చేయలేదు.

రామ్ చరణ్‌ ఈ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మళ్లీ శంకర్ సినిమా షూటింగ్‌లోకి అడుగు పెట్టబోతోన్నాడు. RC 15 సినిమా, భారతీయుడు 2 సినిమాలను శంకర్ ఒకే సారి పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. నెలలో సగం రోజులు ఇది, సగం రోజులు అది అన్నట్టుగా ప్లాన్ చేశాడు. అయితే వచ్చె నెలలో RC 15 షూటింగ్ రెగ్యులర్‌గా జరగబోతోందని తెలుస్తోంది. ఆల్రెడీ రీసెంట్‌గానే రాజమండ్రిలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇక మళ్లీ శంకర్ ఏ ఊర్లో షూటింగ్ ప్లాన్ చేశాడో తెలియాల్సి ఉంది.

Also Read : Samantha Ruth Prabhu Myositis : సమంతకు వచ్చిన వ్యాధి ఏంటి? లక్షణాలు ఏంటి?.. అందుకే మొహాన్ని చూపించలేదా?

Also Read : Bigg Boss Galata Geetu : నీది బొచ్చులో ఆట.. శిక్ష పడాల్సిందే.. గీతూ ఇజ్జత్ తీసిన నాగార్జున

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News