ఆర్ఎస్ఎస్ ఇఫ్తార్ విందును బహిష్కరించిన ముస్లిం సంస్థలు

ఆర్ఎస్ఎస్ ముంబైలో సోమవారం(జూన్ 4) ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును కొన్ని ముస్లిం సంస్థలు బహిష్కరిస్తున్నాయి.

Last Updated : Jun 3, 2018, 08:48 PM IST
ఆర్ఎస్ఎస్ ఇఫ్తార్ విందును బహిష్కరించిన ముస్లిం సంస్థలు

ఆర్ఎస్ఎస్ ముంబైలో సోమవారం(జూన్ 4) ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును కొన్ని ముస్లిం సంస్థలు బహిష్కరిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ఇఫ్తార్ విందు పేరిట మోసం చేస్తున్నదని వారు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది.

ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఏర్పాటు చేసిన విందుకు దాదాపు 30 ఇస్లామిక్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. ముస్లిం సమాజంలోని 200 మంది ప్రముఖులు, అలాగే దాదాపు 100 మంది ముస్లిమేతర ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరౌతారని నివేదికలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామని ముస్లిం రాష్ట్రీయ మంచ్ పేర్కొంది. ఆర్ఎస్ఎస్ ఏ మతానికీ వ్యతిరేకం కాదని అంది. అయితే కొన్ని ముస్లిం సంస్థలు మాత్రం ఆర్ఎస్ఎస్ తన ముస్లిం వ్యతిరేక విధానాలను మార్చుకోనందున ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నాయి.

Trending News