Orange Peel Tea For Weight Loss: వాతావరణంలోని మార్పుల కారణంగా చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు. ప్రస్తుతం భారత్ లో చలికాలం ప్రారంభమైంది కాబట్టి చాలామంది చలి కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు దగ్గు జలుబు చాతి నొప్పి వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు చాలా రకాల ప్రొడక్ట్స్ ను సూచిస్తున్నారు. అయితే వీటి వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని వినియోగించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పై సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన బత్తాయి తొక్కల టీలను తీసుకోవాలని వారు చెబుతున్నారు.
నారింజ తొక్కలో శరీరానికి కావలసిన విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఆయుర్వేద గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ టీ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా ఈ టీ లో ఉండే గుణాలు బరువులు తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
టీ తయారీ పద్ధతి:
ఆరెంజ్ తొక్కల టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఆరెంజ్ తొక్కలను సిద్ధం చేసుకోవాలి. వాటిని రెండు కప్పుల నీటిలో వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ టీ లో దాల్చిన చెక్కను వేసి దాదాపు 20 నిమిషాల పాటు మరిగించి. అందులోనే రెండు టీ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
ఆరెంజ్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలు ఉన్నవారికి ఆరెంజ్ టీ ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు జీర్ణ క్రియలు బలంగా చేసి శరీర బరువును నియంత్రించి, చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తాయి.
గుండెను ఆరోగ్యవంతంగా చేస్తాయి:
ఆరెంజ్ తొక్కల టీలో ఫ్లూపెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ దీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గి.. మంచి కొలెస్ట్రాల స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఈ ట్రై చేయండి.
జలుబు, దగ్గు: వాన, చలికాలంలో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో జలుబు దగ్గు ప్రధానమైనవి. శరీరం లో రోగనిరోధక శక్తి తగ్గడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు నారింజ టి అని క్రమం తప్పకుండా తాగండి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే
Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook