Varsham 4K Special Screening : అతి చేసిన త్రిష.. హర్టైన ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్

Varsham 4K Special Screening ప్రభాస్‌కు మొదటి కమర్షియల్ హిట్ వచ్చిన చిత్రం వర్షం. ఈ సినిమాతో అమ్మాయిలకు అభిమాన హీరోగా మారిపోయాడు ప్రభాస్. త్రిష, ప్రభాస్ జంటకు అందరూ ఫిదా అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 01:05 PM IST
  • ఈశ్వర్ సినిమాకు ఇరవై ఏళ్లు
  • 4K ఫార్మాట్‌లో వర్షం విడుదల
  • ప్రభాస్‌ను పట్టించుకోని త్రిష
Varsham 4K Special Screening : అతి చేసిన త్రిష.. హర్టైన ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్

Trisha ignores Prabhas : ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అయింది. ఈశ్వర్ సినిమాకు వచ్చి శనివారం నాటికి ఇరవై ఏళ్లు పూర్తి అవ్వడంతో.. వర్షం సినిమాను స్పెషల్‌గా స్క్రీనింగ్ చేశారు. 4K ఫార్మాట్‌లో రిలీజ్ చేసిన వర్షం సినిమాను చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. థియేటర్లో అభిమానుల అల్లరి, గోల బాగానే వైరల్ అయింది. ఈ వీడియోలు చివరకు త్రిష వరకు చేరినట్టున్నాయి.

దీనిపై త్రిష స్పందించింది. ఇది తెలుగులో నా మొదటి చిత్రం..  పద్దెనిమిదేళ్ల తరువాత మళ్లీ ఇలా రీ రిలీజ్ చేశారు.. కానీ ఈ చిత్రం నిన్నమొన్న వచ్చినట్టుగా అనిపిస్తోంది.. సినిమాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయ్.. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదని నిరూపించాయ్.. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది మీ ప్రేమ వల్లే.. నా మనసు సంతోషంతో నిండింది అంటూ ఇలా పోస్ట్ వేసింది.

 

దీనిపై ప్రభాస్ అభిమానులు హర్ట్ అయ్యారు. ఇందులో తన సినిమా అన్నట్టుగా, తన గురించి మాత్రమే చెప్పుకుంది. ప్రభాస్ గురించి ఎక్కడా స్పందించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. త్రిషను ట్రోల్స్ చేస్తున్నారు. ఇది నీ కోసం వేసింది కాదు.. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు గడిచిన సందర్భంగా వేసిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు.

ఇక త్రిష అభిమానులు మాత్రం కాస్త హద్దులు దాటేస్తున్నారు. వర్షం సినిమా త్రిష వల్లే హిట్ అయిందని, అప్పటికి ప్రభాస్‌కు అంత ఇమేజ్ లేదని, త్రిష కోసమే సినిమాను చూశారంటూ త్రిష ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు వర్షం మీద మాత్రం ఇలా చర్చలు జరుగుతున్నాయి. అయితే త్రిష, ప్రభాస్‌లు ఎంత మంచి ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : chiranjeevi Latest Pics : 80వ దశకం నాటి హీరో హీరోయిన్లు.. ముంబైలో తారల సందడి.. చిరు స్టైల్ అదుర్స్

Also Read : Bigg Boss Vasanthi Elimination : బిగ్ బాస్ ఇంట్లో ఇకపై అందం కనుమరుగు.. వసంతి పాప అవుట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News