Shraddha Aftab Horror Story: సమాజంపై జరిగే అంశాలపై స్పందిస్తూ.. ఎంతో ఓపెన్ మైండెడ్‌గా జీవించే అమ్మాయి. సొంత కాళ్లపై నిలబడుతూ.. తనకు నచ్చినట్లు జీవించాలని అనుకుంది. జర్నలిస్ట్‌గా మారి ప్రపంచానికి రోజువారీ వార్తలను అందించాలని కోరుకుంది. కానీ ఆమె ఒక చిన్న తప్పు ఆమెను అతిపెద్ద వార్తగా మారుస్తుందని గ్రహించలేకపోయింది. శ్రద్ధా తనకంటే ఎక్కువగా నమ్మి తన సర్వస్వాన్ని త్యాగం చేయగా.. చివరికి ఆమె కథను హారర్ కథగా మార్చింది. ఇప్పుడు శ్రద్ధా హత్య కేసుకు డ్రగ్స్ కోణం కూడా జోడించారు. డ్రగ్స్ వ్యాపారంలో భాగం కావడానికి నిరాకరించడం శ్రద్ధా మరణానికి కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రద్ధా హత్య కేసులో ఒళ్లు గుగుర్పాటుకు గురి చేసే ఒక్కో అంశం తెరపైకి వస్తున్నాయి. విచారణలో అఫ్తాబ్ చెబుతున్న మాటలు విని పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగానే జరిగిన హత్యగా భావించి విచారణ జరుపుతుండగా.. ఈ కేసులో ఇంత మోసం, దారుణం ఉంటుందని పోలీసులు కూడా ఊహించలేదు.
శ్రద్ధా, అఫ్తాబ్‌ల ప్రేమకథ ఇలా మొదలైంది
బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధా, అఫ్తాబ్‌లకు పరిచయం ఏర్పడింది. పరిచయమైన 20 నుంచి 25 రోజుల్లోనే ఇద్దరూ లీవ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించారు. కొద్ది రోజులు ముంబైలో ఇద్దరు ఉన్నారు. మూడేళ్లపాటు ఇద్దరు కలిసే ఉన్నట్లు తెలిసింది. అయితే శ్రద్ధా తల్లి మరణం తర్వాత.. శ్రద్ధాకు నామీని డబ్బు వచ్చింది. ఆ డబ్బును అఫ్తాబ్ అప్పుగా తీసుకుని.. తన విలాసాలకు ఖర్చు చేశాడు. దీంతో ఇద్దరి విభేదాలు మొదలయ్యాయి. అదే సమయంలో అఫ్తాబ్ చాలా మద్యం, గంజాయికి బానిసయ్యాడు. అఫ్తాబ్ నుంచి శ్రద్ధా తన డబ్బును తిరిగి డిమాండ్ చేసినప్పుడల్లా.. అతను తాగిన మత్తులో ఆమెతో గొడవ చేయడం పడేవాడు. ఈ క్రమంలోనే శ్రద్ధాను కూడా డ్రగ్స్‌కు బానిసగా చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనడానికి శ్రద్ధాను తరచుగా డబ్బు అడిగేవాడని సమాచారం.
హత్యకు కుట్ర ఇలా..
ముంబైలో శ్రద్ధా, అఫ్తాబ్‌ల మధ్య గొడవలు వస్తుండడంతో ఆమెను తీసుకెళ్లి చంపడం అఫ్తాబ్ ప్లాన్ వేశాడు. మార్చి నెలలో కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దామని శ్రద్ధాను నమ్మించి.. ఉత్తరాఖండ్, హిమాచల్‌లలో సుదీర్ఘ పర్యటనకు వెళ్దామని ఒప్పించాడు. ఇద్దరూ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్‌లను సందర్శించారు. ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్‌లోని కసోల్, మనాలి, తోష్ గ్రామాలలో కూడా పర్యటించారు.
శ్రద్ధా, అఫ్తాబ్ తోష్ కొండలపై ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు.. ఆమెను కొండపై నుంచి తోసి చంపాలని అనుకున్నాడు. అయితే పొరపాటున శ్రద్ధా బతికితే.. దొరికిపోతానని భావించి అఫ్తాబ్ ఆ సమయంలో ఆగిపోయాడు. ఎవరికీ తెలియని చోటుకు తీసుకువెళ్లి హత్య చేయాలని మరో ప్లాన్ వేశాడు.
ఈ పర్యటనలో బద్రీ అనే వ్యక్తిని కలిసిన తర్వాత మే 8న ఢిల్లీకి రావడం అఫ్తాబ్ కుట్రలో భాగమే. ఢిల్లీకి వచ్చిన తర్వాత శ్రద్ధాకు ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె తన డబ్బును తిరిగి ఇవ్వమని అఫ్తాబ్‌ను అడిగేది. అయితే అఫ్తాబ్ సంపాదించే దానికంటే ఖర్చులే ఎక్కువ వచ్చేవి. దీంతో తనకు కొన్ని రోజుల సమయం కావాలని అడిగేవాడు.
మే 18వ తేదీ రాత్రి శ్రద్ధాతో అఫ్తాబ్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. డ్రగ్స్, ఇతర అమ్మాయిలకు డబ్బు ఖర్చు చేయడంపై గొడవ పడింది. అఫ్తాబ్ సహనం కోల్పోయి శ్రద్ధాను దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత శ్రద్ధా ఛాతీపై కూర్చోని గొంతు నులిమి చంపేశాడు. శ్రద్ధా చనిపోయినట్లు తెలుసుకుని.. ఆమె మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో దాచిపెట్టాడు. 24 గంటల పాటు మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో దాచిపెట్టి.. ఆ సమయంలో మృతదేహాన్ని దాచే మార్గాల కోసం గూగుల్‌లో వెతికాడు.
మృతదేహంలోని 35 ముక్కలను ఎక్కడ పడేశారు..?
మెహ్రౌలీ అడవుల్లో 3 వేర్వేరు దిశల్లో మృతదేహం 35 ముక్కలు విసిరినట్లు అఫ్తాబ్ మొదట అంగీకరించాడని.. అయితే ఇప్పుడు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పడవేసినట్లు చెబుతున్నాడు. పోలీసుల ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే.. అఫ్తాబ్‌కు ఢిల్లీలోని ప్రదేశాల గురించి పెద్దగా తెలియకపోవడంతో శ్రద్ధా శరీర ముక్కలను ఎక్కడ విసిరాడో స్వయంగా అతనికే తెలియడం లేదు. మృతదేహం ముక్కలు విసిరి 6 నెలల కావడంతో అతనికి ఆ స్థలాల గురించి తెలియదు. శరీర భాగాలను తీసుకువెళ్లే సమయంలో వాసన రాకుండా పెర్ఫ్యూమ్ పూసుకునేవాడు.
డ్రగ్స్ వ్యాపారం కోణంలో..
డ్రగ్స్ వ్యాపారంలో భాగం కావడానికి నిరాకరించడమే శ్రద్ధా మృతికి కారణమా అనే కోణంలో ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తోష్‌లో విచారణ జరిపిన తర్వాత.. పోలీసులకు కొన్ని ముఖ్యమైన ఇన్‌పుట్‌లు వచ్చాయి. పెద్ద డ్రగ్ సిండికేట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నాడా..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. తన ప్రేమ వలలో అమ్మాయిలను బంధించి వారి నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాలనుకున్నాడా..? అని అనుమానిస్తున్నారు.
పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతుండగా.. కొత్త కోణాలు కూడా తెరపైకి వస్తున్నాయి. శ్రద్ధాను ముంబైకి దూరంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లడం కేవలం సందర్శనా యాత్రా లేక అతని డ్రగ్స్ సిండికేట్‌ను ఏర్పాటు చేయడమే కారణమా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తోష్‌లో శ్రద్ధాను కొండపై నుంచి విసిరి చంపాలని భావించినట్లు అఫ్తాబ్ ఢిల్లీ పోలీసులకు చెప్పాడు. అయితే ఇలాంటి వాంగ్మూలాలు ఇవ్వడం ద్వారా దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అఫ్తాబ్ స్టేట్‌మెంట్‌లను ధృవీకరించడానికి పోలీసు బృందం తోష్ గ్రామానికి వెళ్లాలనుకుంటోంది. ప్రస్తుతం తమ విచారణతో పాటు అఫ్తాబ్‌కు నార్కో టెస్టు కూడా చేయించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పటివరకు జరిగిన విచారణలో అఫ్తాబ్ పోలీసులకు చెప్పిన విషయాలు నిజమో.. ఎంతవరకు అబద్ధమో తేలిపోవచ్చు.
Also Read: చిరంజీవికి అరుదైన గౌరవం.. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపిక!
Also Read: Mainpuri By Elections: యూపీ రాజకీయాల్లో అనూహ్య ఘటన.. ఆయన పాదాలకు అఖిలేష్ యాదవ్ నమస్కారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook