Man ate woman: యువతిని రేప్ చేసి, చంపి, మాంసం తిని, శిక్ష లేకుండా తప్పించుకున్నాడు.. కానీ

Japanese Man who raped, killed, ate woman Died: ప్యారిస్‌లో తాను చేసిన అతి కిరాతక హత్యను, నేరాన్ని ఇస్సీ సగవ దాచిపెట్టలేదు. 'ఇన్ ది ఫాగ్' అనే నవల రాసి.. ఆ నవల రూపంలో ఒళ్లు గగుర్పొడిచే ఆ హత్యాచారం, నరమాంసాన్ని భక్షించడం వంటి ఘోరాలన్నింటిని ప్రస్తావించాడు. 

Written by - Pavan | Last Updated : Dec 3, 2022, 03:26 PM IST
  • విద్యార్థినిని ఇంటికి ఆహ్వానించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు
  • ఆమెను రేప్ చేసి, మెడల్ షూట్ చేసి, ఆపై నర మాంసాన్ని భక్షించాడు
  • బతికినంత కాలం ఆ అరాచకంనే చెప్పుకుని డబ్బులు సంపాదించాడు
  • నరమాంసభక్షకుడిగా, సెలబ్రిటీ అయిన మోస్ట్ నొటోరియస్ కిల్లర్ రియల్ స్టోరీ ఇది
Man ate woman: యువతిని రేప్ చేసి, చంపి, మాంసం తిని, శిక్ష లేకుండా తప్పించుకున్నాడు.. కానీ

Japanese Man who raped, killed, ate woman Died: ఇది ప్రపంచ నేర చరిత్రలోనే అత్యంత కృూరమైన నేరం. అత్యంత హేయమైన, దారుణ ఘటన. జపాన్ కి చెందిన ఒక నరరూప రాక్షసుడు 1981లో చేసిన నేరం ఇది. అతడి పేరు ఇస్సీ సగవ. అతడు ప్యారిస్ లో చదువుకుంటున్న ఆ రోజుల్లో ఒక డచ్ ఫీమేల్ స్టూడెంట్ ని తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడే ఆమెను రేప్ చేసి చంపేశాడు. అంతటితో ఆ సైకో ఆగడాలు ఆగలేదు. ఆ విద్యార్థిని శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టి కొన్ని శరీర భాగాలను తినేశాడు. మిగతా శరీర భాగాలను వదిలించుకునే క్రమంలో ఇస్సీ సగవ పోలీసులకు దొరికిపోయాడు. 

పోలీసుల విచారణలో ఇస్సీ సగవ తన నేరాన్ని అంగీకరించాడు. అయితే, 1983లో ఫ్రెంచ్ వైద్య నిపుణులు మాత్రం ఇస్సీ సగవ మానసిక పరిస్థితి బాగోలేనందున అతడు విచారణకు అనర్హుడిగా ప్రకటించారు. వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికతో ఫ్రాన్స్ సర్కారు అతడిని మానసిక రోగిగా భావిస్తూ ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో చేర్పించింది. ఆ తర్వాత 1984లో.. అంటే అతడు అరాచకానికి పాల్పడిన మూడేళ్ల తరువాత ఫ్రాన్స్ అతడిని దేశం నుంచి బహిష్కరిస్తూ జపాన్ కి వెళ్లగొట్టింది. 

ఫ్రాన్స్ నుంచి తప్పించుకున్న ఇస్సి సగవకు కనీసం అతడి సొంత దేశమైన జపాన్ లోనైనా శిక్ష పడేలా చేయాలని బాధితురాలి కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కానీ సగవ జపాన్ కి వెళ్లాకా జరిగింది మరొకటి. ఫ్రాన్స్ వెళ్లగొట్టడంతో జపాన్ వచ్చిన ఇస్సి సగవను అక్కడి అధికారులు భిన్నమైన వ్యక్తిగానే పరిగణించినప్పటికీ.. అతడికి చికిత్స మాత్రం అవసరం లేదని తేల్చేశారు. అంతేకాకుండా అతడిని జపాన్ వెళ్లగొట్టిన ఫ్రాన్స్.. అతడి నేర చరిత్రకు సంబంధించిన ఫైలుని మాత్రం జపాన్ అధికారులకు అందివ్వలేదు. దీంతో జపాన్ అధికారులు అతడి కేసు క్లోస్ అయినట్టే భావించి వదిలేశారు. ఆ తరువాత జపాన్ లో ఇస్సి సగవపై ఏ కేసు లేదు... ఎలాంటి విచారణ లేదు. అలా ఏ నేరం చేయని వ్యక్తిగా ఇస్సీ సగవ అందరిలో కలిసిపోయాడు.

ఆ తరువాత సెలబ్రిటీ అవతారమెత్తిన కిల్లర్
ప్యారిస్‌లో తాను చేసిన అతి కిరాతక హత్యను, నేరాన్ని ఇస్సీ సగవ దాచిపెట్టలేదు. 'ఇన్ ది ఫాగ్' అనే నవల రాసి.. ఆ నవల రూపంలో ఒళ్లు గగుర్పొడిచే ఆ హత్యాచారం, నరమాంసాన్ని భక్షించడం వంటి ఘోరాలన్నింటిని ప్రస్తావించాడు. అతి కిరాతకుడే కాదు.. క్షమించారాని నేరం, ఘోర తప్పిదం చేశాననే పశ్చాత్తాపం ఇస్సి సగవలో ఇసుమంతైనా కనిపించలేదు. అందుకే అతడు తన నవలకే కాకుండా కామిక్ బుక్కుకు సైతం తాను చేసిన హత్యనే అంశంగా ఎంచుకున్నాడు. స్థానిక, అంతర్జాతీయ మీడియాలకు తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. నరమాంసభక్షకుడిగా పేరు పడిన ఇస్సీ సగవరపై లెక్కలేనన్ని వార్తలొచ్చాయి. డాక్యుమెంటరీలు తెరకెక్కాయి. సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న ఇస్సీ సగవను చీకొట్టిన వాళ్లు ఉన్నారు. 

మొత్తానికి జీవిత చరమాంకంలో సోదరుడితో కలిసి జీవితం గడిపేసిన ఇస్సీ సగవ అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమైతూ నవంబర్ 24న 73 ఏళ్ల వయస్సులో న్యూమోనియాతో చనిపోయాడు. కుటుబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా అతి కొద్ది మంది అతి సమీప బంధువుల మధ్య ఇస్సీ సగవ అంత్యక్రియలు పూర్తి చేశారు. పదిమందికి తెలిసేలా కార్యక్రమం చేయాలనే ఆలోచన కూడా లేదని ఇస్సి సగవ సోదరుడు స్పష్టంచేశాడు. ఇస్సి సగవ మృతితో చరిత్ర చూసిన నరమాంస భక్షకుడి రియల్ క్రైమ్ స్టోరీ మరోసారి వార్తల్లోకెక్కింది.

Also Read : Woman's Revenge Story: మరొకరిని చంపి అదే శవంతో సూసైడ్ స్కెచ్.. సినిమాను తలపించే రివేంజ్ డ్రామా

Also Read : Husband Murder: భర్తను చంపి, ముక్కలు చేసి.. ఒక్క పొరపాటు ఇద్దరినీ పట్టించింది

Also Read : Extra Marital Affairs: వివాహేతర సంబంధం.. ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News