Woman Kills an other Woman to fake her own suicide: షాపింగ్ మాల్లో పని చేసే యువతిని హత్య చేసి.. ఆ యువతి శవాన్ని తనదిగా నమ్మించే ప్రయత్నం చేసింది ఓ యువతి. అంతేకాకుండా ఆ తరువాత మరో నలుగురిని హత్య చేసేందుకు పెద్ద స్కెచ్ వేసింది. తాను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులను నమ్మించగలిగితే ఆ తరువాత తాను మరో నలుగురిని హత్య చేసి వారిపై ప్రతీకారం తీర్చుకున్నా తాను ఎవ్వరికీ పట్టుబడే అవకాశం లేదని పెద్ద ప్లానే చేసింది. చూడ్డానికి, వింటానికి సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఈ ఘటన గ్రేటర్ నొయిడాలో చోటుచేసుకుంది. నవంబర్ 12న జరిగిన ఈ ఘటన పోలీసుల దర్యాప్తు అనంతరం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రేటర్ నొయిడాకు చెందిన పాయల్ భాటి తల్లిదండ్రులు ఇద్దరూ మే నెలలో సూసైడ్ చేసుకున్నారు. తన తల్లిదండ్రుల సూసైడ్‌కి తమ సమీప బంధువైన సునీల్, అతడి భార్య స్వాతి, ఆమె ఇద్దరు సోదరులే కారణం అని భావించిన పాయల్ బాటి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అందుకోసం తన ప్రియుడు అజయ్ థాకూర్‌తో (27) కలిసి స్కెచ్ వేసింది. అచ్చం తనలాంటి శరీర సౌష్టవం ఉన్న యువతిని గుర్తించి, ఆమెను మర్డర్ చేయాలని, ఆ శవం ముఖాన్ని గుర్తుపట్టడానికి వీలులేకుండా చేసి అది తన శవంగా నమ్మించి తాను ఆత్మహత్య చేసుకున్నానని పోలీసులను నమ్మించాలనేది వారి ప్లాన్. పోలీసుల రికార్డులలో తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగా రుజువైన అనంతరం తన తల్లిదండ్రుల ఆత్మహత్యకు కారకులైన ఆ నలుగురిని హత్య చేసి రివేంజ్ తీర్చుకోవాలని పాయల్ బాటి పథకం వేసింది.
తమ పథకంలో భాగంగా నవంబర్ 12న అజయ్ థాకూర్ వెళ్లి ఓ షాపింగ్ మాల్ లో పని చేసే హేమ చౌదరి (28) అనే యువతిని ఏదో మాయ మాటలు చెప్పి, నమ్మించి ఆమెను పాయల్ భాటి ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ పాయల్, అజయ్ ఇద్దరూ కలిసి ఆమె గొంతు కోసి, మణికట్టు నరాలు తెంపి హత్య చేశారు. ఆ తరువాత హేమ చౌదరి శవం ముఖంపై సలసల కాగే వేడి నూనే పోసి ముఖం గుర్తుపట్టడానికి వీలులేకుండా చిద్రమయ్యేలా చేశారు. ఆ తరువాత తమ రివేంజ్ డ్రామాను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లారు.
ముఖంపై వేడి నూనే పడి తన ముఖం గుర్తుపట్టడానికి వీలులేకుండా తయారైందని.. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం తనని ఎలా ఆదరిస్తుందని.. ఆ ఆవేదనతోనే తాను సూసైడ్ చేసుకున్నానని తాను సైన్ చేసిన ఒక సూసైడ్ లెటర్ ని శవం పక్కనే పడేసి ఆ శవం తనదిగానే పోలీసులను నమ్మించేందుకు పాయల్ భాటి కుట్రకు తెరలేపింది.
మర్డర్ స్కెచ్ ఎలా బయటపడిందంటే..
ఇదిలావుంటే, మరోవైపు సూరజ్ పూర్ ప్రాంతానికి చెందిన హేమ చౌదరి నవంబర్ 12 నుంచి కనిపించకుండా పోగా.. ఆ తరువాత మూడు రోజులకు ఆమె ఆచూకీ లభించడం లేదంటూ ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. హేమ చౌదరి తన తల్లి, సోదరి, ఒక చిన్నారితో కలిసి సూరజ్ పూర్ లో నివాసం ఉంటోంది. షాపింగ్ మాల్ లో పని చేసుకుని పొట్ట పోసుకుంటున్న హేమ చౌదరికి, పాయల్ బాటికి, అజయ్ థాకూర్ కి ఎలాంటి పరిచయం కానీ సంబంధం కానీ లేదు. కేవలం చూడ్డానికి తన లాంటి శరీర సౌష్టవం ఉన్న యువతి కోసం గాలిస్తున్న పాయల్ భాటి, అజయ్ థాకూర్ లకు హేమ చౌదరి కనిపించింది అంతే. అంతకుమించి ఈ ఘటనలో బలైన హేమ చౌదరికి ఎవ్వరితో ఎలాంటి సంబంధం లేదు.
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆమె కనిపించిన చివరి రోజైన నవంబర్ 12 నాడే ఆమెతో అజయ్ థాకూర్ టచ్ లోకి వచ్చినట్టు తెలిసింది. దీంతో అజయ్ థాకూర్ ని అదుపులోకి తీసుకుని నాలుగు పీకి తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు నేరం ఒప్పుకున్నాడు. తన ప్రియురాలు పాయల్ భాటితో కలిసి హేమ చౌదరిని తామే హత్య చేసినట్టు అంగీకరించాడు. ఏదో అనుకుంటే ఏదో అయ్యిందన్నట్టు.. సూసైడ్ డ్రామాతో మొదలుపెట్టి రివేంజ్ డ్రామాతో ముగిద్దాం అనుకున్న తమ రియల్ క్రైమ్ స్టోరీ ఇలా బయటపడిందే అన్నట్టు పాయల్ భాటి సైతం పోలీసుల తన నేరాన్ని అంగీకరించింది. అసలు విషయం బయటపడటంతో హేమ చౌదరిని ఎందుకు చంపాల్సి వచ్చిందో పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించింది.
ఇంతకీ ఈ రివేంజ్ డ్రామా ఎక్కడ మొదలైంది..
తన తల్లిదండ్రులకు తనకు వరుసకు సోదరుడైన సునీల్ గతంలో రూ. 5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ అప్పు తిరిగి చెల్లించాల్సిందిగా సునీల్, అతడి భార్య స్వాతి వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అదే క్రమంలో మే నెలలో తన తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. తన తల్లిదండ్రుల ఆత్మహత్యకు సునీల్, అతడి భార్య స్వాతి, ఆమె ఇద్దరు అన్నాదమ్ముళ్లే కారణం అని భావించిన పాయల్ భాటి వారిపై కోపాన్ని పెంచుకుంది. ఆ కోపంతోనే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించి, ఆ తరువాత ఆ నలుగురిని హతమార్చాలని ప్లాన్ చేసింది. సినీ ఫక్కీలో జరిగిన హేమ చౌదరి మర్డర్ కేసు మిస్టరీని ( Murder Mystery ) ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించడంతో పాయల్ భాటి రివేంజ్ స్టోరీ బయటపడింది.
Also Read : Shraddha Murder Case Update: నార్కో టెస్టులో అఫ్తాబ్ బయటపెట్టిన నిజాలు ఇవే.. ఆ విషయం చెప్పేశాడు
Also Read : Shraddha Murder Case: అఫ్తాబ్‌లో సూపర్ టాలెంట్.. జైలు అధికారులకే షాక్
Also Read : Shraddha Murder: అఫ్తాబ్ మెడకు ఉచ్చు.. నార్కో అనాలిసిస్ లో సంచలన విషయాలు వెలుగులోకి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook