Immunity Booster Foods: శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఈ చిట్కాలతో బైబై చెప్పండి..!

Immunity Booster Foods: శీతాకాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 04:26 PM IST
Immunity Booster Foods: శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఈ చిట్కాలతో బైబై చెప్పండి..!

Immunity Booster Foods: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి లోపం సమస్యలు తలెత్తుతున్నాయి.  దీని కారణంగా చాలా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో ఈ లోపం ప్రాణాంతకంగాను కూడా మారొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి రోజూ వీటిని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది:
1. ఇంట్లోని వంటగదిలో లభించే అల్లం, వెల్లుల్లి, పసుపు, నల్ల మిరియాలు, లవంగాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చలి కారణంగా వచ్చే జలుబు, ఫ్లూ ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తరచుగా ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా తప్పకుండా వీటిని వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని కూడా అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది.

2. శీతాకాలంలో మార్కెట్‌లో పచ్చి కూరగాయలు విచ్చల విడిగా లభిస్తాయి. అయితే ఇందులో ఉండే గుణాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, విటమిన్ సి కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రోగ నిరోధ శక్తి లోపం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ కూరగాయలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

3. సిట్రస్ పండ్ల కూడా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మంచి ఆహారాలతో పాటు ఆరెంజ్, గ్రేప్‌ఫ్రూట్ వంటి పండ్లను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పండ్లను ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా

Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News