Jupiter Transit 2023: ఈ ఏడాది ముగియడానికి.. కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2023లో చాలా గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. నూతన సంవత్సరంలో శని, రాహు-కేతు మరియు బృహస్పతి గ్రహాల యెుక్క గమనంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి తన రాశిచక్రం మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. గురు రాశిలో మార్పు కారణంగా వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది. దేవగురు యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మిథునం (Aries): మేషరాశిలో దేవగురువు బృహస్పతి సంచారం మిథున రాశి వారికి విశేష ప్రయోజనాలను ఇస్తుంది. అదృష్టంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి మరియు ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశాలు ఉన్నాయి.
తుల (Libra): బృహస్పతి యొక్క ఈ సంచారం తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బృహస్పతి ఈ రాశి వారికి పురోభివృద్ధిని ప్రసాదిస్తాడు. వ్యాపారంలో లాభం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
కర్కాటకం (Cancer): గురుడి సంచారం కర్కాటక రాశి వారికి శుభవార్త తెస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కన్య రాశి (Virgo): కన్య రాశి వారు కూడా బృహస్పతి సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. కొత్త సంవత్సరంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా మారుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీనం (Pisces): దేవగురువు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తారు, అయితే మీనరాశికి చాలా ప్రయోజనాలను ఇస్తారు. గురు సంచారం వల్ల ఈ రాశివారి ఆదాయం పెరగుతుంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ ను కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల జీవితం సూపర్ గా ఉంటుంది.
Also read: Jupiter transit 2023: కొత్త ఏడాదిలో గజలక్ష్మీ రాజయోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.