/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Ex Australia Cricketer Rachael Haynes appoints as a Head Coach for Gujarat Giants: వుమెన్స్‌ ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌ త్వరలో ఆరంభం కానుంది. 2023 మార్చి 4న డబ్ల్యూపీఎల్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. వుమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ 2023 తర్వాత ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మహిళల ఐపీఎల్ వేలం ప్రక్రియ ఫిబ్రవరి 11 లేదా 13న నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మెగా టోర్నీలో భాగమయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ మహిళా క్రికెటర్లు  ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రాంఛైజీలు సైతం సపోర్ట్ స్టాఫ్‌పై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే గుజరాత్ జెయింట్స్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. 

డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ ఇప్పటికే టీమిండియా లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను టీమ్ మెంటార్‌గా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా హెడ్‌ కోచ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ వివరాలను వెల్లడించింది. హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ రచెల్ హేన్స్‌ను గుజరాత్‌ నియమించుకుంది. బ్యాటింగ్‌ కోచ్‌గా తుషార్ అరోథేను, భారత మాజీ స్పిన్నర్ నూషిన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా గుజరాత్‌ ప్రాంచైజీ ఎంపిక చేసుకుంది.

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టులో చాలా కాలం పాటు కీలక సభ్యురాలిగా రచెల్ హేన్స్‌ కొనసాగారు. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో హేన్స్‌ కీలకం. ఆస్ట్రేలియా జట్టు తరఫున 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించారు. 77 వన్డేల్లో 2585 పరుగులు చేశారు. అందులో 19 అర్ధ సెంచరీలు ఉండగా.. రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నూషిన్ అల్ ఖదీర్‌ పని చేశారు. ఈ ముగ్గురు గుజరాత్‌ జెయింట్స్‌ మెంటార్‌ మిథాలీ రాజ్‌తో కలిసి పనిచేయనున్నారు. 

డబ్ల్యూపీఎల్‌ 2023 వేలం ముంబై వేదికగా ఫిబ్రవరి 13న జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వేలంలో పాల్గొనేందుకు దాదాపు 1000 మంది మహిళా క్రికెటర్లు తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. మొత్తంగా 90 మందికి మాత్రమే ఈ వేలంలో అవకాశం ఉంటుంది. తొలి మహిళల ఐపీఎల్‌ సీజన్‌లో ఐదు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. ఒక్కో ప్రాంఛైజీకి గరిష్టంగా 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసే అవకాశం బీసీసీఐ కలిపించింది.  

Also Read: Jasprit Bumrah Comeback: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్‌ బుమ్రా!  

Also Read: Joginder Sharma Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 2007 టీ20 ప్రపంచకప్‌ హీరో!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
WPL 2023: Former Australia Cricketer Rachael Haynes appoints as a Head Coach for Gujarat Giants, Mithali Raj is Mentor
News Source: 
Home Title: 

WPL 2023: గుజరాత్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌.. మిథాలీ రాజ్‌తో కలిసి..!
 

WPL 2023: గుజరాత్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌.. మిథాలీ రాజ్‌తో కలిసి..!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

గుజరాత్‌ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా

మిథాలీ రాజ్‌తో కలిసి

77 వన్డేల్లో 2585 పరుగులు

Mobile Title: 
గుజరాత్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌.. మిథాలీ రాజ్‌తో కలిసి
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Friday, February 3, 2023 - 21:27
Request Count: 
34
Is Breaking News: 
No