Surya grahan 2023 Date: పంచాంగం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలు కాలానుగుణంగా ఏర్పడతాయి. ఇది మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవించనుంది. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం, ఉదయం 07:03 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:28 వరకు ఉంటుంది. ఈ గ్రహణాన్ని ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్రం మరియు అంటార్కిటికాతో సహా అనేక దేశాల్లో చూడవచ్చు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతకం కూడా చెల్లదు. ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభ రాశి
సూర్యగ్రహణం ఈ రాశివారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ పొందుతారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
మిథునం
సూర్యగ్రహణం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి పదవి లభించే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు.
ధనుస్సు
సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారవేత్తలు కొత్త ఆర్డర్ లను పొందుతారు. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు శని సడే సతి నుండి విముక్తి పొందుతారు.
Also Read: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలోకి బృహస్పతి... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook