SSLV D2 launch: ఎస్ఎస్ఎల్‌వి డి 2 లాంచ్ కౌంట్ డౌన్ ప్రారంభం, అన్ని దేశాల్లో ఆసక్తి

SSLV D2 launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహాల వాహననౌక ఎస్ఎస్ఎల్‌వి డి2ను అంతిరక్షంలో ప్రయోగించేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2023, 09:06 AM IST
SSLV D2 launch: ఎస్ఎస్ఎల్‌వి డి 2 లాంచ్ కౌంట్ డౌన్ ప్రారంభం, అన్ని దేశాల్లో ఆసక్తి

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరి కాస్సేపట్లో ఎస్ఎస్ఎల్‌వి డి 2 శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాంకేతిక లోపాలతో ఎస్ఎస్ఎల్‌వి రాకెట్ విఫలం కావడంతో..ఈ శాటిలైట్ రూపుదిద్దుకుంది. 

2022 ఆగస్టు 7వ తేదీన ఇస్రో ప్రయోగాత్మకంగా నిర్మించి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్‌వి డి1 రాకెట్ సాంకేతిక కారణాలతో విఫలమైంది. ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టలేకపోయింది. ఇప్పుడు లోపాల్ని సరిదిద్ది..ఎస్ఎస్ఎల్‌వి డి2 రాకెట్ రూపొందించారు. తొలి ప్రయోగం విఫలం కావడంతో ఇస్రోకు భారీ నష్టం ఏర్పడింది. అధునాతన సాంకేతికత ఉన్న ఈ రాకెట్ ద్వారా దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 02తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాల్ని భూమధ్య రేఖకు 450 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. 6.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 9.18 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్ఎస్ఎల్‌వి డి2ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. 

ఈ ప్రయోగం ఈసారి విజయవంతమైతే..అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఉపగ్రహాల్నిపంపించే దేశంగా ఇండియా సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఎస్ఎస్ఎల్‌వి డి2 రాకెట్ ద్వారా ఇండియాకు చెందిన ఈవోఎస్-07, బాలికల స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ రూపొందించిన 8.7 కిలోల బరువు కలిగిన ఆజాదీ శాట్ 02, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానూస్-01 ఉపగ్రహాన్ని పంపించనుంది. 

ఈ ప్రయోగం విజయవంతమైతే అతి తక్కువ దేశాలతో ఉపగ్రహాల్ని పంపించవచ్చు. చిన్న చిన్న ఉపగ్రహాల్ని పంపించేందుకు ఇస్రో వేదిక కానుంది. అందుకే ఈ ప్రయోగం వైపు వివిధ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎస్ఎస్ఎల్‌వి మొత్తం మూడు ఉపగ్రహాల్ని 334 కిలోల పేలోడ్ తో 450 కిలోమీటర్ల వృత్తాకార కక్షలో మొహరిస్తుంది. చిన్న ఉపగ్రహాల లాంచ్ మార్కెట్‌కు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ను ఇస్రోనే పరిచయం చేసింది. పెద్ద పెద్ద మిషన్‌ల కోసం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇప్పటికే ఉంది. 

ఇస్రో మిషన్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ ప్రయోగాన్ని వీక్షించే అవకాశముంది. ఎస్ఎస్ఎల్‌వి లాంచ్ ఆన్ డిమాండ్ ఆధారంగా ఎర్త్ ఆర్బిట్‌కు 500 కిలోల వరకూ ఉపగ్రహాల్ని ప్రయోగించవచ్చు.

Also read: Loan Interest Rate: ఈ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు పెంపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News