Rs. 240 Cr Penthouse: రూ. 240 కోట్ల పెంట్‌హౌజ్.. కొన్నది ఎవరో కాదు..

Rs. 240 Cr Penthouse in Mumbai : సాధారణంగా డూప్లెక్స్ బంగ్లాలు అంటే ఇండిపెండెంట్ స్థలంలో మాత్రమే నిర్మిస్తారు అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఈ ఖరీదైన లగ్జరీ పెంట్‌హౌజ్ డూప్లెక్స్ కూడా కాదు.. ఏకంగా త్రిప్లెక్స్ బంగ్లా ప్యాటర్న్‌లో నిర్మించారు. అది కూడా 63వ అంతస్తు ఎత్తులో.

Written by - Pavan | Last Updated : Feb 10, 2023, 04:39 PM IST
Rs. 240 Cr Penthouse: రూ. 240 కోట్ల పెంట్‌హౌజ్.. కొన్నది ఎవరో కాదు..

Rs. 240 Cr Penthouse in Mumbai : ముంబై :  మీరు చూస్తున్న ఈ పెంట్‌హౌజ్ ఖరీదు అక్షరాల రూ. 240 కోట్లు. అవును.. మీరు చదివింది నిజమే. సాధారణంగా పెంట్‌హౌజ్ అంటే కొనడానికైనా, అద్దెకు ఉండడానికైనా ఖరీదు తక్కువ ఉంటుంది కదా.. కానీ ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఈ లగ్జరీ పెంట్ హౌజ్ మాత్రం అందుకు భిన్నం. ఖరీదైన అపార్ట్‌మెంట్‌లోని 63, 63, 65.. ఈ మూడు అంతస్తులలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పెంట్ హౌజ్ ముంబైలోని వొర్లిలో అనీబిసెంట్ రోడ్డు ప్రాంతంలో ఉంది. 

ఆకాశహర్మ్యాల్లాంటి అపార్టుమెంట్స్‌లో బి- టవర్‌లో ఈ పెంట్‌హౌజ్ నిర్మించారు. ముంబైలోని స్లమ్ ఏరియాలో నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 300 చదరపు అడుగుల ఇంటితో పోల్చుకుంటే ఈ పెంట్ హౌజ్ విస్తీర్ణం సరిగ్గా 100 రెట్లు ఎక్కువ. 

సాధారణంగా డూప్లెక్స్ బంగ్లాలు అంటే ఇండిపెండెంట్ స్థలంలో మాత్రమే నిర్మిస్తారు అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఈ ఖరీదైన లగ్జరీ పెంట్ హౌజ్ డూప్లెక్స్ కూడా కాదు.. ఏకంగా త్రిప్లెక్స్ బంగ్లా ప్యాటర్న్‌లో నిర్మించారు. అది కూడా 63వ అంతస్తు ఎత్తులో. వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ బి.కే. గోయెంక ఈ పెంట్ హౌజ్‌ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. బుధవారమే ఈ పెంట్ హౌజ్ రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. ముంబైలో ఇప్పటివరకు జరిగిన ఖరీదైన అపార్ట్‌మెంట్ డీల్స్‌లో ఇదే అతి పెద్ద డీల్‌గా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదే బి టవర్‌కి ఆనుకుని ఉన్న మరో టవర్‌లో ఉన్న పెంట్ హౌజ్‌ని ప్రముఖ బిల్డర్, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ కొనుగోలు చేశాడు. అది కూడా రూ. 240 కోట్ల డీల్‌కి సెట్ అయింది. మరో బిల్డర్ సుధాకర్ శెట్టితో కలిసి వికాస్ ఒబేరాయ్ స్వయంగా ఈ ప్రాపర్టీని నిర్మించారు. సుధాకర్ శెట్టితో పార్ట్‌నర్‌షిప్‌లో నిర్మించిన ఈ లగ్జరీ ప్రాపర్టీలో పెంట్ హౌజ్‌ని వికాస్ ఒబేరాయ్ తనే సొంతంగా ఉండటానికి కొనుగోలు చేశాడు. వికాస్ ఒబేరాయ్ తన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ ఎస్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈ పెంట్ హౌజ్‌ని రిజిస్ట్రేషన్ చేయించాడు.

ఇది కూడా చదవండి : Renault Kwid Prices: మరింత అందుబాటులోకి రెనో క్విడ్ RXE వేరియంట్ కారు ధర

ఇది కూడా చదవండి : Why Cars Catches Fire: కార్లలో మంటలు ఎందుకు వస్తాయో తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు 

ఇది కూడా చదవండి : Highest Selling Car Brands: ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న కార్లు ఇవే

ఇది కూడా చదవండి : Maruti Cars Discount: కొత్తగా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మారుతి కార్లపై రూ. 46 వేల వరకు డిస్కౌంట్.. ఫుల్ డీటేల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News