ఢిల్లీ: విభజన హామీలు నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు చేస్తూ వచ్చిన టీడీపీ..మరోమారు లోక్ సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం లోక్ సభ సెక్రటరీ జనరల్ కు టీడీపీ ఎంపీ కేశినేని అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు.
సీన్ రీపీట్ అవుతుందా..
గతంలో కూడా టీడీడీ ఇదే అంశంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసు స్వీకరించేందుకు కావాల్సిన ఎంపీల బలం ఉన్నప్పటికీ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో అవిశ్వాస తీర్మానం నోటీసు చర్చకు రాలేదు. ఈ సారి అలాంటి సీన్ పునరావృతం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి..
బీజేపీకి దమ్ముందా..
ఇదిలా ఉండగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన కేశినేని నాని మీడియాతో మాడ్లాడారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అవిశ్వాసానికి 150 మంది ఎంపీల మద్దతు ఉందని..మరింత మంది సభ్యుల మద్దతును కూడగడతామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి దమ్ముంటే అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.