These 4 Zodiac Sign lives will change after 30 years due to Malavya RajYoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... 2023 సంవత్సరం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ రాశుల వారి జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన శని మరియు శుక్ర దేవులు ఈ వ్యక్తులకు పది రెట్లు ఆకస్మిక లాభాన్ని ఇవ్వనున్నారు. అంతేకాదు జీవితంలో భారీ స్థాయిలో పురోగతి ఉంటుంది.
శని దేవుడు 30 సంవత్సరాల తర్వాత గత నెలలోనే కుంభ రాశిలో సంచరించాడు. మరోవైపు ఫిబ్రవరి 15న మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. దాంతో 4 రాశుల జాతకంలో అరుదైన రాజయోగం ఏర్పడబోతోంది. వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులా రాశి వారికి చాలా లాభాలు చేకూరనున్నాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారి జాతకంలో ఫిబ్రవరి 15న శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. శని దేవుడు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తాడు. దీనితో పాటు షాష్ రాజయోగం కూడా రూపొందుతోంది. దాంతో వృషభ రాశి వారు తమ వృత్తిలో ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశాలు లభిస్తాయి.
మిథున రాశి:
మిథున రాశిలో ఫిబ్రవరి 15న శుక్రుడు సంచరించిన వెంటనే కెరీర్లో మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. అదే సమయంలో హన్స్ రాజయోగం ఇప్పటికే ఏర్పడింది. ఈ పరిస్థితిలో మిథున రాశి వారు కొత్త ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న చోటికి బదిలీ అవ్వొచ్చు.
కన్యా రాశి:
ఫిబ్రవరి 15 నుంచి కన్యా రాశి వారి జాతకంలో శుక్రుడు సంచరించిన వెంటనే మాళవ్య రాజ్యయోగం ఏర్పడుతుంది. దీనితో అదృష్టం ఆ రాశి వారికి వెంటే ఉంటుంది. వ్యాపారులకు శుభకాలం ప్రారంభమవుతుంది. అప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీ ద్వారా డబ్బు పొందవచ్చు.
తులా రాశి:
తులా రాశి చక్రంలో శని దేవుడు కేంద్ర త్రికోణ రాజయోగంను ఏర్పరుస్తాడు. దాంతో ఉద్యోగస్తులు అధిక లాభాలు పొందుతారు. ఈ సమయంలో తులా రాశి వారి అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. పది రెట్లు ఆకస్మిక లాభం ఉంటుంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hindu Nav Varsh 2023: హిందూ నూతన సంవత్సర శుభ యాదృచ్చికం.. ఈ మూడు రాశుల వారికి ఏడాది పొడవునా డబ్బే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.