Manik Saha: సస్పెన్స్ వీడింది.. త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ఎన్నిక

Tripura CM Manik Saha: సస్పెన్స్ వీడింది. త్రిపుర సీఎంగా మళ్లీ మాణిక్ సాహానే ఎంపికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను జిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ నిలవగా.. అధిష్టానం మాణిక్ సాహానే ఎంపిక చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 11:27 PM IST
Manik Saha: సస్పెన్స్ వీడింది.. త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ఎన్నిక

Tripura CM Manik Saha: త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా మరోసారి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆయనను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. సాహా పేరును కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ప్రతిపాదించగా.. మిగిలిన సభ్యులు అంగీకరించారు. మాణిక్ సాహా వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేసులో భౌమిక్ కూడా చివరి వరకు పోటీ పడ్డారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక స్థానాన్ని గెలుచుకుంది.

త్రిపుర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 16న పోలింగ్ నిర్వహించగా.. మార్చి 2న ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాల అనంతరం త్రిపుర సీఎం మాణిక్ సాహా తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. అయితే ఆయన రాజీనామా తరువాత సీఎం పీఠం కోసం చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి పేరుకు సంబంధించి ఢిల్లీలో కూడా బీజేపీ పెద్దల కీలక సమావేశం జరిగింది.

ఆదివారం ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఇతర సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే కేంద్ర నాయకత్వం మాత్రం సాహానే మరోసారి త్రిపుర సీఎంగా ఎంపికచేసింది. కేంద్ర సహాయ మంత్రి భౌమిక్ ధన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. 

మాణిక్ సాహా ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకపోవడం.. గిరిజన ప్రాంతాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మార్చి 8న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం సాయంత్రం అగర్తల చేరుకోనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. 

Also Read: Holi 2023: హోలీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగ భృతి ప్రకటన   

Also Read: Twitter: ట్విట్టర్‌లో కీలక మార్పు.. ట్వీట్ లిమిట్ పెంచుతూ ఎలాన్ మస్క్ ప్రకటన  
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News