Jupiter Transit 2023 in Aries: 12 ఏళ్ల తరువాత మేషరాశిలోకి ప్రవేశించనున్న గురుడు.. ఏప్రిల్ 22 నుంచి 3 రాశులకు వద్దన్న డబ్బే డబ్బు

Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను వివిధ రకాల లక్షణాలకు కారకులిగా భావిస్తారు. ముఖ్యంగా గురు గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. విశిష్ట లక్షణాలున్న గురు గ్రహం రాశి పరివర్తనం చెందితే కచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులకు మాత్రం ఊహించని అదృష్టంగా మారనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2023, 04:00 PM IST
Jupiter Transit 2023 in Aries: 12 ఏళ్ల తరువాత మేషరాశిలోకి ప్రవేశించనున్న గురుడు.. ఏప్రిల్ 22 నుంచి 3 రాశులకు వద్దన్న డబ్బే డబ్బు

Jupiter Transit 2023 in Aries: హిందూ జ్యోతిష్యం ప్రకారం గురు గ్రహాన్ని అభివృద్ధికి, పుణ్యం, దానం, పవిత్ర స్థలం, ధార్మిక కార్యక్రమాలు, చదువు, సోదరతత్వం, సంతానం, శిక్షణకు కారకుడిగా భావించడం వల్ల గురుడి గోచారం చాలా మహత్యం కలిగిందిగా ఉంది. 12 ఏళ్ల తరువాత గురుడు మేషరాశిలో ప్రవేశించనుండటం ఆ మూడు రాశుల దశ తిరగనుంది.

గ్రహాల్లో గురు గ్రహానికి చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలన్నింటిలోనూ అత్యధిక శుభఫలాలనిచ్చేది గురు గ్రహమే. జ్యోతిష్యం ప్రకారం వృద్ధి, పుణ్యం, దానం, సంతానం, శిక్షణ, చదువు, ఆధ్యాత్మిక అంశాలకు గురుడే కారకుడు. అటువంటి గురుడు మరోసారి గోచారం చేయనుండటంతో ఆ ప్రభావం అన్ని రాశులపై పడనుంది. ముఖ్యంగా మనిషి జీవితంపై స్పష్టంగా ఉంటుంది. 12 ఏళ్ల సుదీర్ఘ సమయం తరువాత అంటే ఓ పుష్కరం తరువాత గురు గ్రహం మేషరాశిలో ప్రవేశించనున్నాడు.  ఏప్రిల్ 22 గురుగోచారముంది. ఇక అప్పట్నించి మూడు రాశులపై అంతులేని సంపద, అదృష్టం, ధనలాభం కలగనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

సింహ రాశి:

గురుడి మేష రాశి ప్రవేశం కారణంగా సింహరాశి జాతకులకు అత్యంత శుభసూచకం కానుంది. ఈ రాశి వారికి దశ తిరగనుందని చెప్పవచ్చు. ఎందుకంటే అదృష్టం స్థానంలో గురుడి గోచారముంది. తండ్రి సహకారం పూర్తిగా లభిస్తుంది. దాంతోపాటు ప్రయాణాలు లాభాలను కలగజేస్తాయి. విదేశీ ప్రయాణ యోగం ఏర్పడుతుంది. విద్యార్ధులు ఏదైనా పరీక్షకు సిద్ధమౌతుంటే అందులో కూడా విజయం సాధిస్తారు. ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్లడం మంచి ఫలాలనిస్తుంది.

Also Read: Chaturgrahi Yogam: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో నాలుగు గ్రహాల మహా కలయిక.. ఈ 5 రాశులకు తిరుగులేదు ఇక..

మీన రాశి:

గురుడు 12 ఏళ్ల తరువాత మేష రాశిలో ప్రవేశిస్తుండటంతో మీనరాశికి గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. ఏప్రిల్ 22 నుంచి మీన రాశి వారికి అంతులేని ధనవర్షం కలగనుంది. ఈ క్రమంలో పెండింగులో ఉన్న డబ్బులు లేదా నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. పెండింగులో పడిన పనులు సైతం పూర్తవుతాయి. వ్యాపారుల అప్పు తిరిగి వస్తుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం హాయిగా ఉంటుంది. 

మేష రాశి:

గురుడు 12 ఏళ్ల తరువాత మేష రాశిలోనే ప్రవేశించనున్నాడు. కచ్చితంగా ఇది అత్యంత శుభప్రదం కానుంది. ఈ రాశి లగ్నపాదంలో గురుడి ప్రవేశముంది. ఫలితంగా మేషరాశి జాతకుల ఆర్ధిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. సంసార సుఖం లభిస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు బాగుంటాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏవిధమైన ఇతర సమస్యలు బాధించవు.

Also Read: Saturn Transit 2023: మరో 48 గంటల్లో ఈ 3 రాశులవారు ధనవంతులు కానున్నారు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News