ఐపిఎల్ చరిత్రలో భారీ సిక్సులు కొట్టిన ఆటగాళ్లు మీకు గుర్తున్నారా ? ఐపిఎల్ ప్రారంభమైన ఇన్నేళ్లలో ఏయే ఆటగాళ్లు, ఎంత దూరంలో బంతి పడేలా వీర లెవెల్లో సిక్సులు కొట్టారో మీకు ఇంకా గుర్తుందా ? ఐపిఎల్ చరిత్రలో అదిరిపోయే సిక్సులపై ఓ స్మాల్ ఫోకస్
Biggest Sixes of IPL History: ఐపిఎల్ చరిత్రలో భారీ సిక్సులు కొట్టిన ఆటగాళ్లు మీకు గుర్తున్నారా ? ఐపిఎల్ ప్రారంభమైన ఇన్నేళ్లలో ఏయే ఆటగాళ్లు, ఎంత దూరంలో బంతి పడేలా వీర లెవెల్లో సిక్సులు కొట్టారో మీకు ఇంకా గుర్తుందా ? ఐపిఎల్ చరిత్రలో అదిరిపోయే సిక్సులపై ఓ స్మాల్ ఫోకస్
Albie Morkel - ఆల్బీ మోర్కెల్ - 2008 లో ఐపిఎల్ తొలి సీజన్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన సౌతాఫ్రికా ఆటగాడు ఆల్బీ మోర్కెల్ ఎవ్వరూ ఊహించని విధంగా భారీ సిక్సర్ ( 125 మీటర్లు ) కొట్టాడు. ఐపిఎల్ మొత్తం చరిత్రలో ఇదే అతి పెద్ద సిక్స్. ఆ తరువాత మళ్లీ ఇప్పటివరకు ఆ స్థాయిలో సిక్స్ కొట్టిన ఆటగాడు లేకపోవడంతో ఆ రికార్డు ఆల్బీ మోర్కెల్ పేరిటే పదిలంగా ఉంది. ( Twitter Photo)
Praveen Kumar - ప్రవీణ్ కుమార్ - ఒకప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఆల్ రౌండర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎల్ 2013 టోర్నీలో ఏకంగా 124 మీటర్ల డిస్టన్స్‌తో భారీ సిక్సర్ కొట్టాడు. ఐపిఎల్ చరిత్రలో ఇదే రెండో అతి పెద్ద సిక్సర్‌గా నిలిచింది. ( Twitter Photo )
Adam Gilchrist - ఆడం గిల్‌క్రిస్ట్ - ఒకప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కేప్టేన్ ఆడం గిల్‌క్రిస్ట్ ఐపిఎల్ చరిత్రలోనే 3వ బిగ్గెస్ట్ సిక్స్ కొట్టాడు. ఈ భారీ సిక్సర్ డిస్టన్స్ 122 మీటర్లు. 2011 ఐపిఎల్ సీజన్ లో ఆడం గిల్‌క్రిస్ట్ ఈ భారీ సిక్సర్ కొట్టాడు. (Source: Twitter)
Robin Uthappa - రాబిన్ ఊతప్ప - 2010 ఐపిఎల్ సీజన్ లో అప్పటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు 120 మీటర్ల లాంగ్ డిస్టన్స్ తో భారీ సిక్సర్ కొట్టాడు (Source: Twitter).
Chris Gayle -క్రిస్ గేల్ - 2013 ఐపిఎల్ సీజన్ లో అప్పటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టేన్ క్రిస్ గేల్ భారీ సిక్సర్ (119 మీటర్లు) కొట్టాడు. న్యూజీలాండ్ ఆటగాడు రాస్ టేలర్ కూడా 2008 ఐపిఎల్ టోర్నీలో 119 మీటర్ల దూరంతో భారీ సిక్సర్ బాదాడు. (Source: Twitter)
Yuvraj Singh - యువరాజ్ సింగ్ - ఒకప్పటి పంజాబ్ కింగ్స్ జట్టు కేప్టేన్ యువరాజ్ సింగ్ 2009 ఐపిఎల్ సీజన్ లో భారీ సిక్సర్ ( 119 మీటర్లు) బాదాడు. అప్పట్లో ఎంతో ఫామ్ లో ఉన్న యూవీ.. ఆ తరువాతి కాలంలో ఫామ్ కోల్పోయి క్రమక్రమంగా ఫేడౌట్ అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అనారోగ్యం బారినపడిన యూవీ ఆ సమస్య నుంచి కూడా పూర్తిగా కోలుకోవడం అతడి ఆత్మస్థైర్యానికి నిదర్శనం (Source: Twitter)
Gautam Gambhir - గౌతం గంభీర్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కేప్టేన్ గౌతం గంభీర్ ఐపిఎల్ 2013 సీజన్ లో బిగ్గెస్ట్ సిక్సర్ (117 మీటర్లు) బాదాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చిన గంభీర్ ప్రస్తుతం బీజేపి లోక్ సభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ( Twitter Photo )
MS Dhoni - మహేంద్ర సింగ్ ధోనీ. 2009 ఐపిఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కేప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా 115 మీటర్ల దూరంలో బంతి పడేలా భారీ సిక్సర్ బాదాడు. (Photo: BCCI/IPL)
Faf du Plessis - ఫాఫ్ డు ప్లెసిస్ ఐపిఎల్ 2023 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టేన్ ఫాఫ్ డు ప్లెసిస్ 115 మీటర్ల దూరంలో పడేలా భారీ సిక్సర్ కొట్టాడు. (Photo: BCCI/IPL)