అమెరికాలో జనసేన ర్యాలీ ; వర్జీనియాలో పవన్ అభిమానుల సందడి

జనసేన పార్టీ అమెరికా వరకు ఎలా విస్త్రరించింది అని ఆశ్చర్యపోకండి.. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు కొందరు జనసేన చీఫ్ పవన్ కు మద్దతుగా నిలిచేందుకు ఈ మేరకు ర్యాలీ నిర్వహించారు. 

Last Updated : Oct 15, 2018, 03:05 PM IST
అమెరికాలో జనసేన ర్యాలీ ; వర్జీనియాలో పవన్ అభిమానుల సందడి

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేపట్టిన ‘పోరాట యాత్ర’ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో జన సైనికుల కవాతుకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పవన్ నిర్వహిస్తున్న ఈ కవాతుకు మద్దతుగా అమెరికాలోని పవన్ అభిమానులు కారు ర్యాలీ  నిర్వహించారు. దీంతో జనసేన జెండాలతో వర్జీనియాలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా.. కార్లు ఒకదాని వెంట మరొకటి దూసుకెళ్లాయి. ఈ సందర్భంగా అభిమానులు జై జనసేన, జై పవన్ కల్యాణ్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కార్లను ‘జన సేన’ అనే ఇంగ్లిష్ అక్షరాల్లో ఉన్నట్లు పార్క్ చేసి తమ అభిమానాన్ని తెలియజేశారు.  దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

 

Trending News