Mumbai Boat: ముంబై సముద్రంలో 13 మంది జల సమాధి.. 101 మంది సురక్షితం

13 Dead And 101 Rescued In Mumbai Boat Accident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా సమీపాన సముద్రంలో ప్రయాణిస్తున్న స్పీడ్‌ బోట్‌ ఓ చిన్న పడవను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనపై ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

1 /8

ముంబైలో ఘోర సంఘటన జరిగింది. సరదాగా సముద్ర ప్రయాణం చేస్తున్న పర్యాటకుల స్పీడ్‌ బోటు ప్రమాదానికి గురయ్యింది.

2 /8

ఎలిఫంట్‌ దీవుల వద్దకు వెళ్లి వస్తున్న నీల్‌కమల్‌ అనే స్పీడ్‌ బోట్‌ పొరపాటున ఓ చిన్న పడవను ఢీకొట్టింది.

3 /8

వేగంగా వస్తూ చిన్న పడవను ఢీకొట్టడంతో నీల్‌కమల్‌ స్పీడ్‌ బోటు నీటిలో మునిగిపోయింది.

4 /8

ప్రమాదానికి ముందు స్పీడ్‌ బోటులో దాదాపు 100కు మందికి పైగా పర్యాటకులు, ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

5 /8

వెంటనే నావికాదళం, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.

6 /8

ఈ ప్రమాదంలో దాదాపు 80 మందిని సురక్షితంగా కాపాడారని అధికారులు వెల్లడించారు. అయితే సముద్రంలో మునిగి 13 మంది మృతి చెందారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

7 /8

ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

8 /8

నిత్యం ఇక్కడ గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎలిఫంట దీవులకు పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.