2025 Tollywod Most Awaited Movies: 2025లో అపుడే చాలా చిత్రాలు రిలీజ్ డేట్ ప్రకటించుకున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయితే.. మరికొన్ని చిత్రాలు తన విడుదల తేదిని కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న బిగ్ స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
2025లో సంక్రాంతి నుంచి తెలుగులో బడా హీరోల చిత్రాల సందడి మొదలు కానుంది. గేమ్ ఛేంజర్ తో మొదలు కాబోతున్న ఈ సందడి వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం వరకు రిలీజ్ డేట్స్ కన్ఫామ్ అయిన బడా హీరోల చిత్రాల విషయానికొస్తే..
గేమ్ ఛేంజర్ (Game Changer) రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను ఈ యేడాది చివర్లో విడుదల చేస్తున్నట్టు చెప్పినా.. విజయ దశమి సందర్బంగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అదే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విశ్వంభర మరో డేట్ కు పోస్ట్ అయింది.
NBK 109 నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాకు ‘డాకూ మహారాజా’, ‘సర్కార్ సీతారామ్’ టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఏది ఫిక్స్ చేస్తారనేది దీపావళి రోజున తెలుస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాము.. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాము’. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
హరి హర వీరమల్లు పార్ట్ - 1 ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ పార్ట్ -1 సోర్డ్ వర్సెస్ స్పిరిట్. ఈ సినిమాను మార్చి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ది రాజా సాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూన్న ‘విశ్వంభర’ చిత్రాన్ని జవనరి 10న విడుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించింది మెగాస్టారే. అయితే ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ డేట్ లో విడుదల కోసం ఈ సినిమాను మే 9కు పోస్ట్ పోన్ చేశారు.
వార్ 2 ‘దేవర పార్ట్ -1’ తర్వాత ఎన్టీఆర్ డైరెక్ట్ గా బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.