7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!

7th Pay Commission DA Hike Update: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాల పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. బేసిక్ పేలో భారీ పెంపుదల ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 
 

1 /7

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి డీఏ 4 శాతం పెరిగింది. మార్చిలో పెంపు ప్రకటన రాగా.. జనవరి నెల నుంచి అమలులోకి వచ్చింది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది.  

2 /7

ప్రస్తుతం రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. బేసిక్ పేలో భారీ పెంపుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

3 /7

డీఏ పెంపుతోపాటు ఇతర అలవెన్సుల పెంపులో కూడా మార్పులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ గణనీయంగా పెరుగుతుంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

4 /7

కొత్త ప్రభుత్వం వచ్చేయడంతో డీఏ పెంపుపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. డీఏ 50 శాతానికి చేరడంతో జీరో నుంచి లెక్కిస్తారా..? 50 శాతానికే యాడ్ చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.   

5 /7

ద్రవ్యోల్బణాన్ని లెక్కించే AICPI డేటా ఇంకా రిలీజ్ కాలేదు. మే 31న విడుదల చేయాల్సి ఉండగా ఆలస్యమైంది.   

6 /7

ఈ డేటాను జూన్ నెలాఖరున విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

7 /7

ఇక్కడ అందజేసిన సమాచారం.. కేవలం ఉద్యోగులకు అప్‌డేట్ ఇవ్వడానికి మాత్రమే రాసినది. శాలరీ లేదా అలవెన్సుల పెంపుదలకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. కచ్చితమైన సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.